Trs chief kcr press meet at telangana bhavan

TRS chief kcr press meet at telangana bhavan, all telangana obstructors are betrayers trs chief kcr, TRS leader KCR,

TRS chief kcr press meet at telangana bhavan, all telangana obstructors are betrayers trs chief kcr

వారిద్దరిదీ వన్ సైడ్ లవ్ అంటున్న కేసిఆర్?

Posted: 10/01/2013 01:12 PM IST
Trs chief kcr press meet at telangana bhavan

తెలంగాణ పై మాట మార్చిన పార్టీలను ద్రోహులుగానే పరిగణిస్తామని తెరాస అధినేత కేసిఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో కేసిఆర్ మాట్లాడుతూ.. సీమాంద్ర లో తన బొమ్మను, సోనియా గాంధీ బొమ్మను రాక్షసంగా చిత్రీకరిస్తున్నారు. అశోక్ బాబు వీదికొట్టాలటకు రమ్మన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ భాష, విధానం సంస్కారమా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో తెదేపా ఎంపీలు ఉచ్చరించలేని భాషలో మాట్లాడారన్నారు. ఎంత తాత్సారం చేస్తే అంత వైషమ్యాలు పెరుగుతాయి, త్వరగా బిల్లు తేవాలని కోరారు. సీమాంద్రలో సంయమనం పాటించాలని ఎన్నోసార్లు విజ్నప్తి చేశా.. నేను వినయ పూర్వకంగా విజ్నప్తి చేసినా బూతులు తిట్టడం, శవయాత్రలు ఆపలేదన్నారు. దత్తాత్రేయ నేను మాట్లాడితేనే విమర్శిస్తున్నారు. అటువైపు మాటుల వినపడట్లేదా అని ప్రశ్నించారు. సకల జనుల భేరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా సంస్కారహీనంగా మాట్లాడలేదన్నారు. తనను రోజూ ఎన్నో తిట్లు తిడుతుంటారని ఆయన అన్నారు. సీమాంధ్రుల మాటలన్నీ సంస్కరవంతమైనవేనా అన్నారు. బీజేపీ నేత దత్తాత్రేయ, సీపీఐ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. వారిద్దరిదీ వన్ సైడ్ లవ్ అంటూ తప్పబట్టారు. సీమాంధ్ర నేతలు విద్వేషాలు పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు విష బీజం నాటవద్దని కేసీఆర్ సూచించారు. తెలంగాణ గిరిజనులను గోచీగాళ్లంటారా అని ప్రశ్నించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles