Kcr fires on cm kiran kumar reddy

KCR Fires on CM Kiran Kumar reddy, TRS meeting, TRS Bhavan, TRS Leaders fime on cm kiran

KCR Fires on CM Kiran Kumar reddy, TRS meeting, TRS Bhavan, TRS Leaders fime on cm kiran

కిరణ్ తొండి చేసి వందల కోట్లు సంపాదిస్తున్నాడు

Posted: 09/28/2013 08:53 PM IST
Kcr fires on cm kiran kumar reddy

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై తెలంగాణ నాయకులు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో తనదైన శైలిలో మూకుమ్మడి దాడి చేశాడు. సమైక్యాంధ్రకు మద్దతుగా మీడియాకు ప్రకటనలు ఇస్తూ, అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ఆయన పై కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న కిరణ్ అభివ్రుధ్ది పేరుతో వందల కోట్లు సంపాదిస్తున్నాడని, ఆయన చేసిన అభివ్రుద్ధి ఎక్కడ కనిపించడం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కిరణ్ చరిత్ర ఏమిటో చెబుతామని, ఇప్పటి ఫైళ్ళన్ని తీసి రివ్యూ చేస్తామని అప్పుడు కిరణ్ బండారం బయటపడుతుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పోరాడుతున్న నన్ను తిట్టుకుంటూ సీమాంధ్రులు ఉద్యమం చేస్తారా ?

    ఆంధ్రవారితో ఇంకా కలిసి ఉండటం సాధ్యం కాదని, కిరణ్ గతంలో అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారని ఇప్పుడు దానికే కట్టుబడి ఉండాలని అన్నారు. మరో టీఆర్ఎస్ నేత ఎం.పి. వివేక్ అయితే కిరణ్ పై వింత తరహా వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కు మొదటి నుంచి తొండి అలవాటు ఉందని అంటున్నారు.ఆయనకు పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఆయన చెప్పారు.అలాగే పాఠశాల దశ నుంచే ఓడిపోవడం అలవాటేనని కూడా ఆయన చెప్పారు.ఇష్టం వచ్చి మాట్లాడుతున్న సి.ఎమ్.ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈ వ్యాఖ్యల పై కిరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles