Ponguleti sudhakar reddy rose flower message

ponguleti sudhakar reddy rose flower message, Congress MLC, Ponguleti Sudhakar Reddy, eemandhra congress legislators, Ponguleti Sudhakar Reddy

ponguleti sudhakar reddy rose flower message

చెవికెక్కిన గులాబీ సందేశం

Posted: 09/04/2013 12:16 PM IST
Ponguleti sudhakar reddy rose flower message

సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆందోళనలు, కలిసి ఉండాలన్న కోరికను తప్పుబట్టాల్సిన అవసరం లేదని శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించి సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీ భావం తెలిపేందుకు మద్దతుగా శాసనసభ ఆవరణలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ శాసనసభ్యులు చేపట్టిన సంఘీభావ దీక్షను ఆయన సందర్శించారు. దీక్షలో పాల్గొన్న వారికి పొంగులేటి గులాబీలు ఇచ్చి అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. అయితే ఆయన ఇచ్చిన గులాబీలను ఎమ్మెల్యేలు చెవిలో పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పటికీ విడిపోయి నంత మాత్రాన తమ బంధాలు చెదిరిపోవన్నారు. రాజీవ్‌ సద్భావన కమిటీ సభ్యునిగా నిరసన దీక్షలో ఉన్నవారికి గులాబీలు ఇచ్చానని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles