Hari krishna resignation accepted

hari krishna resignation accepted, TDP leader Hari Krishna, Rajyasah Chairman, Nandamuri Bala Krishna, Chandra Babu Naidu

hari krishna resignation accepted

హరికృష్ణ రాజీనామా ఆమోదం

Posted: 08/22/2013 03:02 PM IST
Hari krishna resignation accepted

ముందు ప్రకటించినట్లుగానే తెలుగు దేశం పార్టీకి చెందిన నందమూరి హరికృష్ణ ఈరోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు.  అంతకు ముందు చేసినట్లుగా కాక ఈసారి సరైన ఫార్మెట్ లో తయారుచేసిన రాజీనామా పత్రాన్ని హరికృష్ణ రాజ్యసభ ఛైర్మన్ కి అందజేసారు. 

హరికృష్ణ రాజీనామా అందిందని, దాన్ని రాజ్యసభ ఆమోదించటం జరిగిందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభలో ప్రకటన చేసారు. 

పైకి రాకుండా లోపల్లోపలే కుతకుతలాడుతున్న చంద్రబాబు నాయుడు, హరికృష్ణల మధ్య విభేదాలు ఇప్పటికీ బాహాటంగా బయటకు రాకపోయినా ఇలాంటి కొన్ని సంఘటనల వలన పైకి తెలిసిపోతుంటాయి.  బాలకృష్ణ కూతురు వివాహానికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల గైర్ హాజరీ కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.  అయితే సమస్యంతా పార్టీ శ్రేణుల్లో వస్తుంది.  ఎవరికి జై కొట్టాలో ఎవరికి వద్దో అర్థం కాక సందేహాలలో కొట్టుమిట్టాడుతుంటారు.  ఏ విషయం బాహాటంగా చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కానీ ఇలా ముసుగులో గుద్దులాటలే మిగిలినవారికి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. 

సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధానంగా ఉద్యమ కారులు రాజీనామాలను కోరుతున్న సందర్భంగా హరికృష్ణ రాజీనామా ప్రత్యేకతను సంతరించుకున్నది. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles