Eamcet counselling stopped in seemandhra

eamcet counselling stopped in seemandhra, Eamcet counselling in 56 centers, Eamcet Engineering Counselling, Seemandhra agitation, samaikyandhra agitation

eamcet counselling stopped in seemandhra

సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిపివేత

Posted: 08/19/2013 12:34 PM IST
Eamcet counselling stopped in seemandhra

సీమాంధ్రలో 34 కేంద్రాలలో ఈరోజు జరగవలసిన ఎమ్ సెట్ ఇంజినీరింగ్ విద్యార్థుల కౌన్సిలింగ్ సమైక్యాంధ్ర ఉద్యమం వలన జరగలేదు. 

విశాఖపట్నంలో ఉపాధ్యాయులు ఇతర విద్యశాఖకు చెందిన సిబ్బంది ఎమ్ సెట్ కౌన్సిలింగ్ ని బహిష్కరించారు.   విశాఖపట్నంతోపాటు అనంతపూర్, తిరుపతి, విజయవాడలలో ఆందోళనలవలన కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు.  చెదురుమదురుగా విద్యార్థి సంఘాలు ప్రతిఘటించటం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఎమ్ సెట్ కౌన్సిలింగ్ ని నిలిపివేస్తున్నామంటూ ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువడింది.  రాష్టంలో మొత్తం 56 కేంద్రాలలో జరగవలసిన ఎమ్ సెట్ కౌన్సిలింగ్ లో 34 సీమాంధ్రలోను, 22 కేంద్రాలు తెలంగాణా ప్రాంతంలోనూ ఏర్పాటు చేయగా, ఆందోళనలు ఉధృతంగా ఉండటంతో అక్కడ నిలిపివేస్తున్నట్టుగా తెలియజేయటం జరిగింది. 

ఉద్యమం జరుగుతున్నా కూడా ఎలాగైనా ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించాలని చూసిన ఉన్నత విద్యా మండలి ప్రయత్నాలు సఫలం కాలేదు.  చాలా చోట్ల ఆందోళనలు, ఉద్రిక్త వాతావరణం, తోపులాటలు, అరెస్ట్ లు జరిగాయి.  భారీ బందోబస్తులు చేసినా, విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాశాఖలోని ఇతర సిబ్బంది విధులను బహిష్కరించటంతో నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించవలసి వచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles