No permission for rail rokos dinesh reddy

No permission for rail rokos, DGP Dinesh Reddy, Samaikyandhra protest, Telangana Statehood, CWC decision on Telangana

no permission for rail rokos- dinesh reddy

రైల్ రోకోలకు అనుమతి లేదు

Posted: 08/08/2013 01:40 PM IST
No permission for rail rokos dinesh reddy

హైద్రాబాద్ లో డిజిపి దినేష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైల్ రోకోలకు అనుమతులు లేవని, అటువంటి కార్యక్రమాలను చేసే ఆలోచన ఉంటే దాన్ని రద్దు చేసుకోవలసిందిగా ఉద్యమకారులకు మీడియా ద్వారా తెలియజేసారు.  రైల్ రోకో చేసినట్లయితే నాన్ బెయిలబుల్ వారెంటు ఉంటుందని దినేష్ రెడ్డి హెచ్చరించారు.  

ఇరు ప్రాంతాలవారూ పోలీసు శాఖకు సమానమేనని దినేష్ రెడ్డి తెలియజేసారు.  పోలీసులకు కులమతప్రాంతీయ భేదాలు లేవని, అందరూ సమానమేనని, హైద్రాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టిన నిబంధనలే సీమాంధ్రలోని విశ్వవిద్యాలయాలకూ వర్తిస్తాయని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన ఏర్పాటు చెయ్యటానికి రెండు వారాల ముందుగానే డిజిపి ని ఢిల్లీ పిలిపించటం జరిగింది.  రాబోయే ప్రకటనకు సంబంధించిన వివరాలు ముందుగానే అందబట్టే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించటం వలన ఎటువంటి అవాంఛిత సంఘటనలూ జరగలేదని దినేష్ రెడ్డి అన్నారు.

నిరసనలు తెలియజేసే హక్కు ఉంది కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించిన దినేష్ రెడ్డి ఉద్యోగుల ప్రాంగణంలో ఆందోళనను చెయ్యవద్దని కోరుతూ దేశ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటాన్ని వ్యతిరేకిస్తూ అందుకు బాధ్యుల మీద కఠిన చర్యలు  తీసుకుంటామని కూడా తెలియజేసారు.

రైళ్ళను అడ్డుకోవటం కానీ, రైల్వే ఆస్తులను ధ్వంసం చెయ్యటం కానీ చేస్తే సహించేది లేదని దినేష్ రెడ్డి స్పష్టం చేసారు.

అయితే దినేష్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ తెరాస నేత జూపల్లి కృష్టారావు ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చెయ్యాలని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles