White house would cost 1 8 mln per month as rent

White House,Barack Obama,Insurance, white house,Barak Obama,hire worth,newyork daily news

If US President Barack Obama was a tenant at the White House, he could afford to stay at the 132-room iconic mansion for just over six months.

వైట్ హౌజ్ అద్దె నెలకు 110 కోట్లు

Posted: 08/08/2013 12:31 PM IST
White house would cost 1 8 mln per month as rent

సాధారణంగా ఇంటి అద్దె, లేక ఆఫీసు అద్దె ఎంత ఉంటుంది. మహా అయితే వేలు, లేక లక్షల్లో ఉంటుంది. కానీ అగ్రరాజ్యం అమెరికా పాలనా అధ్యక్షుడి భవనం అద్దె మాత్రం కోట్లలో ఉంటుందని ప్రముఖ దిన పత్రిక ‘న్యూయార్క్ డెయిలీ ’అనే పత్రిక ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుల వారు ఒకవేళ ఆయన పరిపాలనా  భవనం వైట్ హౌజ్ కి అద్దె చిల్లించాల్సి వస్తే... ఆరు నెలలకు మించి ఆయన దానిని భరించే పరిస్థితి లేదంటూ లెక్కలేసి మరీ చెప్పింది. మరి ఈ సువిశాల భవనం అద్దె నెలకు ఎంతో తెలుసా ? అక్షరాల 110 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. 132 గదులతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ర్మించిన భవనానికి నెల రూ. 110 కోట్లు (18 లక్షల డాలర్లు) పైనే అని, ఈ భవనానికి ఏటా రూ.66.75 లక్షలు (1.09 లక్షల డాలర్లు) పన్ను చెల్లించాల్సి వస్తుందని, అయితే, అధ్యక్షుడు బరాక్ ఒబామా నికర విలువ రూ.74.7 కోట్లు (12.2 లక్షల డాలర్లు) మాత్రమే. ఆయన వార్షికాదాయం రూ.24.4 కోట్లు (4 లక్షల డాలర్లు) మాత్రమే కావడంతో ఆరు నెలలు మాత్రమే అద్దె చెల్లించగలడని చెప్పింది. అగ్రరాజ్యం పాలనా భవనమా  ? మజాకా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles