One more heart attack in seemandhra

heart attacks in Seemandhra, State bifurcation, Congress announced State division, separate Telangana, Hyderabad capital issue, A K Antony, Digvijay Singh

one more heart attack in seemandhra

మరో గుండె ఆగిపోయింది

Posted: 08/06/2013 12:35 PM IST
One more heart attack in seemandhra

బొక్కా సుంకరుడు అనే నలభై సంవత్సరాల పశ్చిమ గోదావరి వాసి రాష్ట్ర విభజనను తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు.  ఈ విషయాన్ని తణుకు మండలంలోని ఎర్రనీలిగుంట లోని అతని కుటుంబ సభ్యులు తెలియజేసారు.

చాలా కాలంగా తెలంగాణా ఉద్యమం విషయంలో నత్త నడక నడిచిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా యుపిఏ, సిడబ్లుసి సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించటంతో ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం ,మొన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వ్యాఖ్యలతోనూ, నిన్న రాజ్యసభలో కూడా ఆర్థిక మంత్రి చిదంబరంతో ప్రకటన చెయ్యటంతోనూ మరింతగా వేడెక్కుతోంది.

ఇప్పటి వరకు సమాక్యాంధ్ర కోసం చాలా మంది చనిపోయారు.  అందులో 10 వరకూ గుండెపోటుతో చనిపోయిన ఉదంతాలు, కొన్ని ఆత్మహత్యలు, కొన్ని ఆత్మహత్యా ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి.  ఇప్పటికైనా సీమాంధ్రుల వ్యధను అర్థం చేసుకుని, చేసిన ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకోవాలంటూ అనేకమంది నాయకులు అంటున్నారు. 

సీమాంధ్ర ప్రజల మనోభావాలను అధ్యయనం చెయ్యటం రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమీక్షించే దిగ్విజయ్ సింగ్ లతో కూడిన ద్విసభ్య కమిటీని కేంద్రం నియమించింది.  ఆ కమిటీకి, ప్రధానమంత్రి దృష్టికి కూడా సీమాంధ్రుల మనోభావాలను తీసుకెళ్తామని అన్న కేంద్ర మంత్రి జెడి శీలం, రాజీనామాలు మార్గాంతరం కాదని తెలియజేసారు. 

ఏది ఏమైనా సామాన్యులకు అర్థమయ్యే విధంగా ప్రకటనలు ఉండాలి కానీ ద్వంద్వాలకు కానీ ఒక ప్రాంతానికి పక్షపాతం చూపిస్తూ తమను అన్యాయానికి గురిచేసారే అనే భావనలకు కానీ చోటివ్వ గూడదంటూ పలువురు విజ్ఞలు అభిప్రాయపడుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles