Telangana declaration on july 12th

telangana declaration on july 12th, core committee meet on july 12th, final decision on state bifurction, telangana movement, sonia gandh, decision on telangana on july 12th, digvijay,

Telangana Declaration on July 12th

12న ముహూర్తం

Posted: 07/09/2013 08:12 PM IST
Telangana declaration on july 12th

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మాటల్లో ఇక నిర్ణయమే తరువాయి అన్న స్పష్టత స్పష్టంగా కన్పిస్తోంది. ఇంత చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం మీద మాత్రం అందరికీ ఎక్కడో ఒక అనుమానం కలవరపెడుతోంది. అసలు నిజంగా కాంగ్రెస్ సమస్యను పరిష్కరిస్తుందా అన్న అనుమానం కలగక మానదు. మరోసారి తెలంగాణపై ఈ నెల 12, 13 తేదీలలో తేల్చేయవచ్చన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి ఈ నెల పన్నెండో తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయగా, ముందు దానిని సాయంత్రం నుంచి ఉదయానికి మార్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ సమావేశం రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి 12,13 తేదీలలో ఢిల్లీలో అందుబాటులో ఉండాలని, రోడ్ మాప్ తో రావాలని కోరినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ 12వ తేదీన కోర్ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. సోనియాగాంధీ నిర్ణయం కోసం తాను కూడా వేచి ఉన్నానని, నిర్ణయం వచ్చాక, దానిని అమలు చేయడమే తన బాధ్యత అని అన్నారు. కాగా రాయలసీమ జెఎసి నేతలు కూడా దిగ్విజయ్ ను కూడా కలిసి రాయలసీమను విభజించవద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles