Complaint against mla sudheer reddy wife

complaint against mla sudheer reddy wife, mla sudheer reddy wife black money story lb nagar mla sudheer reddy black money mla sudheer reddy wife kamala, kamala reddy, congress mla g. sudhir reddy, complaint, aruna ,

Complaint against MLA Sudheer Reddy wife

కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య బ్లాక్ మనీతో దాదాగిరి? కేసు

Posted: 07/08/2013 03:16 PM IST
Complaint against mla sudheer reddy wife

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్యపై సైదాబాద్ పిఎస్ లో ఆర్ధిక వేధింపుల కేసు నమోదైంది. సుధీర్ రెడ్డి భార్య కమల తనను అదనపు డబ్బుల కోసం వేధిస్తోందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య కమల వద్ద అరుణ అనే మహిళ కొంతమొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఆ మొత్తాన్ని కొద్దిరోజుల క్రితమే తిరిగి చెల్లించింది. అయితే తనకు అదనంగా డబ్బు చెల్లించాలని కోరుతూ ఎమ్మెల్యే భార్య తనను నిత్యం వేధించేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ముందు ఆ మహిళ మాట్లాడుతూ.. తాను సుధీర్‌రెడ్డి భార్య కమలకు బినామీనని, బ్లాక్‌మనీని దాచమని తనకు రెండు కోట్లు ఇచ్చిందని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత రెండు కోట్లు తిరిగి తీసుకుని అదనపు డబ్బుల కోసం వేధించిందని ఆరోపించింది.

అంతేకాక తనపై సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి దాడి చేశారని రక్తపు మరకలు కూడా చూపించింది.కానీ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఇంతకు ముందు చెప్పిన దానికి సంబంధం లేకుండా కొత్త వెర్షన్‌ వినిపించింది. కమల దగ్గర తాను అప్పు మాత్రమే తీసుకున్నానని చెప్పింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించినప్పటికీ అదనపు డబ్బు కోసం ఎమ్మెల్యే భార్య వేధిస్తోందని ఫిర్యాదు చేసింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిజానిజాలపై పూర్తి విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే మహిళ విభిన్న వాదనలకు ఎమ్మెల్యే బెదిరింపులే కారణమా లేక తెరవెనుక ఏదైనా ఒప్పందం కుదిరి ఆమె మాటమార్చిందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles