Secunderabad hotel collapse 12 killed

secunderabad hotel collapse 12 killed, city light hotel collapse hotel, ity light hotel, city light hotel building collapse in secunderabad collepse, owner hasan injured, son mustafa dead, minister danam nagender, ghmc commissioner krishna babu, cm kiran, geetha reddy,

Secunderabad hotel collapse: 12 killed, City Light Hotel Collapse hotel,City Light Hotel building collapse in Secunderabad

పెరుగుతున్న మృతుల సంఖ్య..

Posted: 07/08/2013 02:45 PM IST
Secunderabad hotel collapse 12 killed

ఆర్పీరోడ్ లో కుప్పకూలిన సిటీలైట్ హోటల్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న 12 మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డ 25 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మరోవైపు సిటీలైట్ భవనం శిథిలాల తొలగింపు కొనసాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి తెలిపారు. భవన శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గాయపడ్డవారిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కాగా.. ఈ ప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 10 మంది గాయపడ్డట్టు సమాచారం. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియలేదు.

భవనం కూలిన సమయంలో అందులో డెబ్బై మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు పలువురిని రక్షించారు. విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసి సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సహాయ సిబ్బంది పలువురిని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కుప్పకూలిన భవనంలో రెండంతస్తులు ఉన్నాయి. కాలం చెల్లిన భవనం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రొక్లయిన్లతో శిథిలాల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా భారీ ట్రాఫిక్ జాం కావడంతో రాష్ట్రపతి రోడ్డు, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. భవనం కూలిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు పరిశీలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles