Ys barathi manhandled police constable

ys barathi reddy, manhandled police constables, nampally court, cbi, chenchelguda jail

YS Barathi manhandled police constable.

భారతి కానిస్టేబుల్ ని కుమ్మేసింది

Posted: 06/08/2013 09:12 AM IST
Ys barathi manhandled police constable

అక్రమాస్తుల కేసులో భర్త జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే తట్టుకోలేక పోతుందో, లేక తనను ఎవరు ఏం చేస్తారనే ధీమానో కానీ ఈ మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భార్య అయిన వైయస్ భారతి లేడీ డాన్ లాగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య సుప్రీంకోర్టులోనే సీబీఐ అధికారిని పట్టుకొని ‘మీకు పిల్లలు లేరా ? అని నిలదీశారు. తాజాగా ఇప్పుడు నాంపల్లి కొర్టులోనే ఓ కానిస్టేబుల్ ని పట్టుకొని చాచి ఒక్కటిచ్చారు. దాదాపు ఆరునెలల తరువాత జైలు నుండి దాల్మియా కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్ ని కలిసిందుకు తమ కుటుంబ సభ్యులు వచ్చారు. కోర్టులోనికి కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తామని కానిస్టేబుల్ చెప్పడంతో తన అనుచర వర్గాన్ని లోనికి పంపించడం లేదని ఆగ్రహించిన భారతి కానిస్టేబుల్ వీపుపై అరచేత్తో కొట్టారు. దీంతో బిత్తరపోయిన కానిస్టేబుల్ భారతి వాహనంలో వచ్చిన ఇతరులనూ వదిలేశారు. ఇదే అదనుగా వైసీపీ కార్యకర్తలు కూ డా కోర్టు హాల్లోకి వెళ్లిపోయారు. దీంతో గందరగోళం ఏర్పడంతో న్యాయమూర్తి కేసును పదినిమిషాలు వాయిదా వేశారు. ఎంత పెద్ద రాజకీయ నాయకురాలు భార్య అయినా ఇలా ప్రభుత్వ అధికారి పై చేయిచేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles