Telangana news trs leader pocharam srinivasa reddy comments on chandrababu naidu

pocharam srinivasa reddy, trs leader pocharam srinivasa reddy, trs party, tdp, chandrababu naidu, telangana issue, telangana student suicide, congress party,

trs leader pocharam srinivasa reddy comments on chandrababu naidu

చంద్రబాబు వలనే ఆత్మహత్యలు?

Posted: 05/30/2013 09:12 AM IST
Telangana news trs leader pocharam srinivasa reddy comments on chandrababu naidu

తెలంగాణపై కేంద్రం సానుకూలంగా ప్రకటన చేస్తే 2009 డిసెంబర్‌ 10న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడం వల్లే నిరాశతో తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ ఆత్మహత్యలన్నింటికీ చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని చెప్పిన చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వారి కుటుంబాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాము గతంలో ప్రణబ్‌కమిటీకి,

అఖిలపక్ష సమావేశంలో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని చెబుతున్న చంద్రబాబు అసలు ఆ లేఖలో ఏముందో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మహానాడులో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఒకవైపు తెదేపాకు డిపాజిట్‌లు పోతున్నా చంద్రబాబుకు అర్థం కావడంలేదా అన్నారు. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి తెలంగాణపై స్పష్టం ఇచ్చి పరువు నిలబెట్టుకోవాలని సూచించారు. తాము నిర్వహించే శిక్షణా తరగతులకు నియోజకవర్గం నుండే 15 వేల మంది హాజరవుతుంటే, రాష్ట్ర వ్యాప్తంగా మహానాడుకు 20 వేల మంది కూడా రాలేదన్నారు. బాబు, జగన్‌, కిరణ్‌లు ఆంధ్రా బాబులేనని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles