Sanjay dutt moved to pune yerawada jail

bollywood actor sanjay dutt, pune yerawada jail, yerawada central jail, special tada court, pune jail

sanjay dutt moved to pune yerawada jail

ఖైదీ సంజయ్ దత్ ..?

Posted: 05/22/2013 07:00 PM IST
Sanjay dutt moved to pune yerawada jail

సినిమాల్లో ఒక హీరో జైలుకు వెళ్లితే ఎలా ఉంటాడు? అక్కడున్న ఖైదీలతో మంచిగా ఉంటూ, ఖైదీ బట్టలు ధరించి, జైలు అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. బాలీవుడ్ టాప్ హీరో అయిన సంజయ్ దత్ కూడా జైల్లో అలాగే ఉన్నారు. పూణేలోని యెరవాడ జైలులో ఖైదీ దుస్తులను సంజయ్ దత్ దరించి ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు ఖైదీ నెంబర్ కూడా కేటాయిస్తారు. దానిపై సి అనే అక్షరం ఉంటుంది. సి దోషి అనే అర్థాన్నిస్తుంది.

సంజయ్ దత్‌ను ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి గత రాత్రి పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. దోషిగా జైలు జీవితం గడపాల్సి ఉంది. సంజయ్ దత్‌ను అండా సెల్‌లో ఉంచే అవకాశం ఉంది. అది అండాకారంలో ఉంటుంది. ఈ సెల్ సగభాగం పునాదిలోకి వెళ్తుంది. దీనికి భద్రత ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇంటి నుంచి తెచ్చే భోజనానికి, చాపకు, దిండుకు, మందులకు కోర్టు సంజయ్ దత్‌కు అనుమతి ఇచ్చింది. జైలులో ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడానికి మాత్రం కోర్టు అనుమతి నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles