Cbi court summons andhra home minister sabitha reddy

Jadan Reddy Assets case,P Sabitha Indra Reddy,Politics,SabithaIndra Reddy, India.

A special court Monday issued summons to Andhra Pradesh Home Minister P. Sabitha Indra Reddy in a disproportionate assets case involving YSR Congress party leader YS Jaganmohan Reddy

కోర్టు మెట్లు ఎక్కబోతున్న చేవెళ్ల చెల్లెమ్మ

Posted: 05/14/2013 12:12 PM IST
Cbi court summons andhra home minister sabitha reddy

మన రాష్ట్ర మహిళా హోంమంత్రి, చేవెళ్ళ చెల్లెమ్మగా పేరొందిన సబితా ఇంద్రారెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో తొలి అవినీతి మహిళా మంత్రిగా కోర్టు మెట్లు ఎక్కబోతుంది. ఇప్పటికే పలువురు మంత్రులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. త్వరలో అంటే వచ్చే నెల 7వ తేదీన సబితను కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో సీబీఐ సబితా రెడ్డి పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈ అభియోగాలను కోర్టు పరిగణలోకి తీసుకుని ఈమెతో పాటు 12 మంది నిందుతులకు సమన్లు జారీ చేసింది.  జగతి, భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులు, అందుకు ప్రతిగా దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి నిక్షేపాల కేటాయింపులో సబిత ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. జగన్ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో సబిత ఏ4(నాలుగో నిందితురాలు)గా ఉన్నారు. జగతి, భారతీ సిమెంట్స్‌లో రూ. 95 కోట్ల పెట్టుబడులు, అందుకు ప్రతిగా దాల్మియాకు సున్నపురాయి నిక్షేపాల కేటాయింపులో ఆమె ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. మొత్తం 13 మంది నిందితుల్లో సబితతో పాటు ఏ5గా ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఏ6గా గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles