Political lakshmi parvathi is very happy in ntr statue unveiling at parliament

lakshmi parvathi, N.T. Rama Rao in Parliament, NTR statue unveiling at Parliament, ntr wife lakshmi parvathi, chaddrababu naidu, purandeswari, balakrishna, tdp leaders, speaker mirakumar,

lakshmi parvathi is very happy in ntr statue unveiling

లక్ష్మీ పార్వతి హ్యాపీ

Posted: 05/07/2013 02:33 PM IST
Political lakshmi parvathi is very happy in ntr statue unveiling at parliament

నిన్నటి వరకు విమర్శలతో మీడియాలో రచ్చ రచ్చ చేసిన నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతికి స్పీకర్ మీరా కుమార్ నుండి సాయంత్ర ఫోన్ రావటం జరిగింది. మీకు ఇష్టమైతే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రావచ్చునని స్పీకర్ మీరా కుమార్ చెప్పినట్లు సమాచారం. మీరాకుమార్ ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్నారు లక్ష్మీపార్వతి. అప్పటికే అక్కడ ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు ఉన్నారు. ఒక్కసారిగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూడగానే లక్ష్మీపార్వతిలో.. ఆనందం కట్టలు తెంచుకుంది. నందమూరి రామారావు కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు లక్ష్మీపార్వతికి స్వాగతం చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న లక్ష్మీపార్వతికి ఒక్కసారి కుటుంబ సభ్యులను చూసి ఆనందంతో పులకించిపోయినట్లు తెలుస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ అన్నగారి కుటుంబాన్ని ఒకేచోటకు చేర్చింది.

ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి లక్ష్మీ ప్రణతి, నందమూరి లక్ష్మీ పార్వతి.... ఇలా కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అన్నగారి కుటుంబాన్ని ఒకేచోట చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లక్ష్మీపార్వతి, బాలకృష్ణలో ఒకేచోట పక్కపక్కన నిల్చున్నారు. అందరూ ఒకే వేదికపైకి రావడంపై లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మరుపురాని ఘటన అని, అందరు ఒకేచోట చేరడం ఆనందం కలిగించిందన్నారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో తనను తానే మర్చిపోయానని, విగ్రహావిష్కరణకు పూనుకున్న పురంధేశ్వరికి కృతజ్ఞతలు అని, తాను ఏమైనా అంటే మనసులో పెట్టుకోవద్దని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు, బాలయ్యతో, లక్ష్మీపార్వతి మాటలు కలిపినట్లు తెలుస్తోంది. ఇది మరుపురాని, మర్చిపోలేని అనుభూతి అన్నారు. కుటుంబమంతా ఒక్కచోటకు వచ్చిందని ఆమె ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మీ పార్వతి చెప్పారు. అయితే లక్ష్మీపార్వతి ఆనందం చూసిన రాజకీయ నాయకులకు కొత్త అనుమానం వస్తుందట.? ఈ ఆనంధం ఇలాగే ఉంటే లక్ష్మీపార్వతి మళ్లీ టిడిపి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టిడిపి రాజకీయ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles