First year intermediate results released today

first year inter results, op scorer from khammam dist, krishna dist tops in passing, mahaboobnagar least in inter, krishnaveni college kothagudem, t

first year intermediate results released today

ఇంటర్ మీడియేట్ ప్రథమ సంవత్సర ఫలితాలు

Posted: 04/21/2013 04:27 PM IST
First year intermediate results released today

 

ఈ రోజు ఉదయం 9 గంటలకు మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారథి ఇంటర్ మీడియేట్ ప్రథమ సంవత్సర ఫలితాలను విడుదల చేసారు. ఈ నెల 25, 26 తేదీల్లో రెండవ సంవత్సరం ఫలితాలు వెలువడచ్చని ఆయన అన్నారు.

 

కృష్ణాజిల్లా విద్యార్థులు అత్యధికంగా 74 శాతం పాసవగా ,మహబూబ్ నగర్ విద్యార్థులు అత్యల్ప 40 శాతం పాసయ్యారు. మొత్తంలో చూసుకుంటే 891337 విద్యార్థలు పరీక్షలకు హాజరవగా, 486658మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే, 54.6 శాతం ఉత్తీర్ణత లభించింది. ఇది పోయిన సంవత్సరం కంటే ఎక్కువ శాతమే. ఆడపిల్లలు 59.46 శాతం, మగపిల్లలు 50.22 శాతం, వొకేషనల్ కోర్సు వాళ్ళు 46.54 శాతం ఉత్తీర్ణులయ్యారు.

 

ఖమ్మం జిల్లా కొత్తగూడం నుంచి మిట్టపోలు రోసిత్ 470 కి 467తో రాష్ట్రంలో అత్యధిక మార్కులు సంపాదించారు. ఈ విద్యార్థి కొత్తగూడెం కృష్ణవేణి కాలేజ్ లో ఎంపిసి చదువుతున్నాడు. తన విజయానికి కారణం అధ్యాపకుల రోజువారీ నిర్దేశాలేనని అన్నాడు రోసిత్. కృష్ణవేణి కాలేజ్ కి ఖమ్మం జిల్లాకి పేరు తెచ్చిన రోసిత్ ను కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, ఇంకా ఎంతోమంది తెలిసినవాళ్ళు అభినందనలతో ముంచెత్తారు.

 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles