Women police to curb mmts eve teasing

eve teasing in mmts, women police in mmts, secunderabad railway station, eve teasing in twin cities

women police to curb mmts eve teasing

ఈవ్ టీజర్లూ ఖబర్ దార్

Posted: 04/21/2013 09:32 AM IST
Women police to curb mmts eve teasing

సికిందరయ్యకో అలవాటుంది.  సికిందరాబాద్ హైద్రాబాద్ లలో తరచుగా అద్దె ఇళ్ళు మారుస్తుంటాడు.  అలా మారినప్పుడల్లా ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళను వారం రోజులపాటు తేరపార చూసి వాళ్ళ ఫొటోలను మనసులో ముద్ర వేసుకుంటాడు.  ఏమిటండీ పాడు అలవాటు అంటుంది అతని భార్య.  ఏం లేదే, సిటీ బస్సులోనో, లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఆడవాళ్ళ వైపు చూస్తుంటాం కదా, మరీ పొరుగువాళ్ళనే అలా చూస్తే బాగుండదని అంటూ నసిగాడు సికిందరయ్య (సికిందరాబాద్ వాసికి నకిలీ పేరు). 

కళ్ళతోనే తినేసేట్టుగా చూడటం నాగరికతకాదు కానీ అలా ఒట్టి గా చూసే రోజులు కూడా పోయాయి.  టీజింగ్ పేరుతో రకరకాల చేష్టలు చెయ్యటం ఆడవాళ్ళ మనసు నొప్పించటం ఒక గొప్పతనం అనుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు.  దాన్ని నగర ప్రయాణంలో పాస్ టైం అనుకుంటున్నారు.  నలుగురితో కలిస్తే మరీ రెచ్చిపోయి ఒకరిని మించి మరొకరు టీజింగ్ పనిలో అభివృద్ధిని చూపించటం విద్యార్థులలోనే కాదు ఉద్యోగులలో కూడా ఎక్కువైపోయింది. 

వీళ్ళ ఆగడాలకు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా పోలీసులు ఆకతాయిల ఆటలు కట్టించటానికి వల పన్నారు.  మహిళా పోలీసులు లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసేవారిలా నటిస్తారు.  పొరపాటున వాళ్ళ కళ్ళబడి వాళ్ళకి దొరికారో మరి అంతే సంగతులు.

ఇది తెలిసిన సికిందరయ్యకి ఇప్పుడు మరో పని పడింది.  పక్కింటి ఆడవాళ్ళే కాదు, సామాన్య మహిళలా అమాయకంగా ప్రయాణం చేస్తున్న మహిళా పోలీసులను కూడా గుర్తుపట్టే పని. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles