Famous playback singer pb srinivas died

pb srinivas, play back singer, telugu, hindi, tamil, kannada, malayalam, gemini movies, rani ratna prabha, tamil new year day

famous playback singer pb srinivas died

పి.బి.శ్రీనివాస్ కన్నుమూసారు

Posted: 04/14/2013 04:32 PM IST
Famous playback singer pb srinivas died

ప్రఖ్యాత నేపథ్య గాయకుడు పి.బి.శ్రీనివాస్ కన్నుమూసారు. 

సెప్టెంబర్ 22, 1930 లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ 1952 లో జెమిని వారి మిస్టర్ సంపత్ లో లభించిన మొదటి అవకాశంతో చిత్రరంగంలో నేపథ్య గాయకునిగా అడుగుపెట్టారు.  అందులో ఆయన జిక్కి, గీతాదత్, శంషాద్ బేగమ్ తో కలిసి పాట పాడారు.  ఆ తర్వాత 1955 లో మళయాళ సినిమా హరిశ్చంద్రలోనూ, రాణీ రత్న ప్రభ తెలుగు సినిమాలోనూ పాటలు పాడారు.  ఇక ఆ తర్వాత ఎన్నో కన్నడ, తెలుగు సినిమాలలో పాటలు పాడారు. 

పి.బి.శ్రీనివాస్ చివర్లో పాడిన పాటలు తమిళ సినిమాలకే.  ఆయన చివరి గీతం 2010 లో విడుదలైన తమిళ సినిమా అయిరాతిల్ ఒరువన్ కి.

పి.బి.శ్రీనివాస్ తన చెన్నైనివాసంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి తుది శ్వాస వదిలారు.  తమిళనాడులో ఉంటూ తమిళ ఉగాది నాడు ఆయన మృతిచెందటం విశేషం.  ఆయన మరణ వార్త వినగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్య ఆయన కుటుంబీకులకు సంతాపం తెలియజేసారు. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీరంగంలోని పూర్వకాలపు ప్రముఖులు, సంగీత ప్రియులు ఆయన మరణానికి సంతాపాన్ని ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles