Tv artists arrested

telugu tv artists, dubbed serials, tv artists vows, telugug tv artists agitation telugu cine artists, tv artists arrested, saradhi studios

tv artists arrested

టివి కళాకారుల అరెస్ట్

Posted: 04/13/2013 02:38 PM IST
Tv artists arrested

 

సారధి స్టూడియోస్ ఎదురుగా ఆందోళన చేపట్టటమే కాకుండా మా టివి కార్యక్రమాలను అడ్డుకోబోయిన టివి కళాకారులను పోలీసులు అరెస్ట్ చేసారు.  అరెస్టైన వారిలో ప్రభాకర్, రోజారమణి, కౌషిక్, బెంగళూరు పద్మ తదితరులున్నారు. 

 

అనువాద టివి సీరియల్స్ ని అనుమతించమంటూ ఆందోళనకు దిగిన టివి కళాకారులకు ఈ టివి సానుకూలంగా స్పందించింది.  జీ టీవి కూడా సానుభూతిని ప్రకటించింది కానీ రాతపూర్వకంగా హామీ ఏమీ ఇవ్వలేదు.  జెమిని, మా టీవిలు మాత్రం ఆందోళనలను పట్టించుకోవటం లేదు. నిన్న మాటివి కార్యాలయంలోని ప్రధాన అద్దం ద్వారాన్ని కళాకారులు పగులగొట్టారు.  ఫర్నిచర్ ని ధ్వంసం చేసారు.  అయితే పోలీసులు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు.  మీడియా వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోల సాయంతో కళాకారులను గుర్తుపట్టి అరెస్ట్ చేస్తామని పోలీసులు అన్నారు కానీ ఆ పని ఇంకా జరగలేదు. 

 

తమిళంలోనూ హిందీలోనూ విజయవంతంగా నడిచిన సీరియల్స్ ని తీసుకుని వాటిని తెలుగులోకి అనువాదం చెయ్యటం టివి ఛానెల్స్ కి చాలా సులభంగా ఉంది.  అంతకు ముందు తమిళ హిందీ భాషల్లో జనాదరణ పొందటం వలన ఆ విషయాన్ని చెప్పి వ్యాపార ప్రకటనలు తీసుకోవటం చాలా సులువైన మార్గం.  అదే కొత్త సీరియల్ అయితే దాని గురించి విశదీకరించవలసి వస్తుంది.  వ్యాపార సంస్థలు త్వరగా ఒప్పుకోకపోవచ్చు, అడిగినంత చెల్లించకపోవచ్చు.  అందువలన డబ్బింగ్ సీరియల్స్ తెలుగు ఛానెల్స్ లో వెల్లువలా విరుచుకుపడ్డాయి.  దానితో, తెలుగు కళాకారులకు తగినంత పనిలేక పూర్తిగా దానిమీదనే ఆధారపడ్డవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.  అందువలన టివి కళాకారులు ఆందోళన చేస్తూ నిరాహార దీక్షలు ప్రారంభించారు.  వారికి సినిమా కళాకారులు, దర్శకులు, వామపక్ష నేతలు కూడా మద్దతుని ప్రకటించారు. 

 

-శ్రీజ

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles