High court gave two weeks time for digitisation

stb, cable tv digitisation, high court of ap, analog tv cable operation

high court gave two weeks time for digitisation

analog-tv-cable.png

Posted: 04/02/2013 03:18 PM IST
High court gave two weeks time for digitisation

oxygen-to-anlog

ఎస్ టి బి కి మరో రెండు వారాల గడువు. అనలాగ్ కి ఊపిరి పీల్చుకోవటానికి రెండు వారాల ఆక్సిజన్.

నిన్నటి నుంచి హైద్రాబాద్ నగరంలో చాలా చోట్ల టివి కేబుల్ ప్రసారాలు నిలిచిపోవటంతో నగరవాసులు నిరాశకు లోనయ్యారు. సెట్ టాప్ బాక్స్ లు అమర్చుకోవటానికి కేంద్ర ప్రభుత్వం విధించిన ఆఖరు తేదీ మార్చి 31తో ముగియటంతో డిజిటైజ్ చేసిన టివి కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి.

అయితే రాష్ట్ర హైకోర్టు, ప్రసారాల డిజిటైజేషన్ మరో రెండు వారాల వరకూ చెయ్యవద్దని ఆదేశమిచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న అనలాగ్ విధానాన్ని మరో రెండు వారాలు కొనసాగించమని, అందులో అంతరాయం కలిగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనితో అనలాగ్ కి మరి కొంత కాలం ఊపిరి పీల్చుకోవటానికి ఆక్సిజన్ దొరికింది.

మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతిని కూడా కోరారు. రాష్ట్రం లోని ముఖ్యనగరాలలో డిజిటైజేషన్ కి మరో నెల వరకూ సమయాన్ని పొడిగించమని కోరుతూ లేఖ రాసారు.

 -శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2000 new rtc buses to hit roads in current year
Guntur software employee missing in us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles