ఢిల్లీలో మున్సిపల్ స్కూల్ లో బాలిక మీద జరిగిన అత్యాచారం వార్త విని మంగోల్ పురి వాసులు నిన్న ఆందోళనకు దిగారు. బస్సులను, హాస్పిటల్ లో వస్తువులను ధ్వంసం చేసారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసే క్రమంలో 12 మందిని అరెస్ట్ చేసారు. గురువారం నాడు స్కూల్ కి వెళ్ళిన రెండవ తరగతి చదువుకుంటున్న బాలిక మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి కలిగిన గాయాలను చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అత్యాచారం జరిగినట్టుగా హాస్పిటల్ పరీక్షణలో తేలిన తర్వాత పోలీసులు శుక్రవారం కేసుని నమోదు చేసారు. స్కూల్ లోని టీచర్లు, ఇతర సిబ్బందిని విచారిద్దామని పోలీసులు ఉపక్రమిస్తుండగానే కొందరు ఆందోళనకారులు హాస్పిటల్ ఎదురుగా రోడ్డు మీద ట్రాఫిక్ ని నిలిపివేస్తూ హాస్పిటల్ లోకి ప్రవేశించి అక్కడి వస్తువులను ధ్వంసం చెయ్యటం మొదలుపెట్టారు.
అత్యాచారానికి గురైన బాలిక హాస్పిటల్ లో చనిపోయిందన్న వార్త బయట వ్యాపించటంతో స్థానికుల ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. బస్సుని ధ్వంసం చేసిన మూకలు పోలీసు వాహనాలను, పోలీస్ చౌకీని కూడా లక్ష్యంగా చేసుకుని విధ్వంసాన్ని సృష్టించగా పోలీసు సిబ్బందిలో ముగ్గురు గాయపడ్డారు.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ అదనపు కమిషనర్ దీపక్ హస్తిర్ మాట్లాడుతూ, ఈ విషయంలో దర్యప్తు చేస్తున్న పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని, అపరాధం చేసినవారెవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
మధ్యాహ్న భోజనానికి వెళ్ళిన బాలికను చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలను దూర్చి అత్యాచారానికి ఒడిగట్టారంటూ ఆ పాప తండ్రి ఆవేదనతో చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more