Terrorist motivepng

terrorist-motive.png

Posted: 02/26/2013 10:29 AM IST
Terrorist motivepng

ఉగ్రవాదికి తను చేసే నష్టం కన్నా వెయ్యి, లక్షల రెట్లు నష్టం కలిగితే ఇంకా పైశాచిక సంతోషమే. 

దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ లక్ష్యం నగరంలో మత కల్లోలాలు సృష్టించటమేనని కేంద్ర రక్షణ శాఖకి అందిన సమాచారం వలన తెలుస్తోంది.  నిర్మల్ లో మజ్లీస్ ఎ ఇత్తెహదూల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగం వలన, విశ్వ హిందూ పరిషత్ కి చెందిన ప్రవీణ్ తగోడియా ఉపన్యాసం వలనా నగరంలోని అటు హిందూ, ఇటు ముస్లిం పౌరులు మనస్తాపంతో కుమిలిపోతూ ఏ చిన్న మిషమీదైనా ఇరు వర్గాల మధ్యా పోరు సంభవించే అవకాశం ఉందని ఉగ్రవాదుల కుత్సితమైన ఆశ. 

అందుకే ముందు దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా మందిరంలో బాంబు పేల్చే వ్యూహం పన్నినా, గురువారం అవటం వలన విపరీతమైన జననష్టం సంభవించటం, దానితో మత కలహాలు వెల్లువెత్తటం జరుగుతుందని ఆశపడ్డా, ఆ రోజు అది వీలుకాకపోవటానికి కారణం, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆ రోజు సాయిబాబా ఆలయంలో దర్శనం కోసం వస్తుండటంతో జరిగిన భారీ పోలీసు బందోబస్తు.  

భారత కేంద్ర రక్షణ శాఖ పైకి ప్రకటించటం లేదు కానీ, ఈ బాంబు పేలుళ్ళ వెనుక నుండి పనిచేయించింది లష్కర్ ఏ తాయిబా అని, ముందుండి నడిపించింది ఇండియన్ ముజీహిదీన్ అని సమాచారం ఉంది.  లష్కర్ ఎ తాయిబా పెద్ద తలపోటుగా మారిందని, హైద్రాబాద్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు కేంద్ర స్థానమైందని, ఇండియన్ ముజాహిదీన్ కి సాంకేతిక పరిఙానాన్ని, అవసరమైన ధన సహాయాన్ని కూడా లష్కర్ ఏ తాయిబా చేస్తోందని రక్షణ శాఖలోని ఒక సీనియర్ అధికారి అనధికారికంగా తెలియజేసారు. 

హైద్రాబాద్ పేలుళ్ళ స్థలంలో దొరికిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించటం జరిగింది.  రక్షణ శాఖ ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.  అయితే ఇప్పుడే ఏ విషయాన్నీ బయటకు చెప్పలేమని, అపరాధులను మాత్రం కఠినంగా శిక్షించటం జరుగుతుందని, రక్షణ శాఖామాత్యులు ఆర్ పి ఎన్ సింగ్ అన్నారు. 

హైద్రాబాద్ లో ప్రాధమిక దర్యాప్తులు పూర్తవగానే రక్షణ శాఖ నుంచి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కి అప్పగించబడుతుంది.  ప్రస్తుతం ఎన్ఐఏ, నిఘా సంస్థ, జాతీయ భద్రతా సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా స్థానిక పోలీసులకు దర్యప్తులో సహకరిస్తున్నారు.  కానీ తర్వాత మాత్రం అన్నివిధాలా ఇటువంటి కేసులలో దర్యాప్తు చేసే సామర్థ్యం సాంకేతిక నైపుణ్యం గల ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తుందని రక్షణ శాఖ చెప్తోంది. 

ఏది ఏమైనా ఉగ్రవాదుల లక్ష్యాన్ని సంయమనం గల హైద్రాబాద్ వాసులు చెదరగొట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway budget proposal by minister bansal
Malasia flight emergency landing at hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles