Gulam nabi azad all praises for ap and chief minister

gulam nabi azad, telangana, bomb blast, kiran kumar reddy

gulam nabi azad all praises for people of ap, chief minister and media.

gulam-nabi-azad.png

Posted: 02/25/2013 09:29 AM IST
Gulam nabi azad all praises for ap and chief minister

gulam-nabi-prases-apహైద్రాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు దాడి ఘటనా స్థలిని, గాయపడిన వారిని సందర్శించేందుకు వచ్చిన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల మంత్రి గులామ్ నబీ ఆజాద్ నిన్న రాత్రి మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేసారు. 

అటువంటి విపత్కర పరిస్థితిలోనూ హైద్రాబాద్ వాసులంతా సంయమనాన్ని పాటించారని, మత విద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా ప్రవర్తించారని, లోగడ లుంబినీ పార్క్ లోనూ, గోకుల్ చాట్ భండార్ లో బాంబు పేలుళ్ళ సమయంలో కూడా పౌరులంతా సంయమనంతా మెలిగారని, అటువంటి సమయాల్లో అలా ప్రవర్తించటం చాలా అవసరమని, హైద్రాబాద్ వాసుల మానసిక పరిణితి దీనితో అర్థమౌతోందని ఆజాద్ అన్నారు.
ఆ తర్వాత ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న చర్యలను బలపరుస్తూ, బాంబు దాడి వలన నష్టపోయినవారికి ఇంత వరకూ ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్ట పరిహారాన్ని ప్రకటించటమే కాక, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వారికి మెరుగైన వైద్య సేవలనందించటమనేది చాలా ఉదాత్తమైన చర్య అని కొనియాడారు.

చివరగా, ఆజాద్ మీడియాను కూడా ప్రశంసించారు.  తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఏ భాషలోనూ మీడియా వారంతా ఎంతో మానసికంగానూ వృత్తిపరంగానూ పరిపక్వతను ప్రదర్శిస్తూ,  మత విద్వేషాలు రేగే విధంగా మాట్లాడకుండా, జరిగిన సంఘటనలోని వాస్తవాలను ఎప్పటికప్పుడు చక్కగా కవర్ చేసారని, ఆంధ్రప్రదేశ్ మీడియాను ప్రశంసలతో ముంచెత్తారు.

తెలంగాణా సమస్య గురించి ప్రస్తావించగా, అది చాలా జటిలమైన సమస్య కాబట్టి త్వరగా దాని విషయంలో నిర్ణయం తీసుకోమని సిఫారస్ చేసానని చెప్తూ, త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని చాలా డిప్లోమేటిక్ గా చెప్పారు ఆజాద్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two women killed in delhi and ap
Indian based life of pi in oskar awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles