Party high command fire on botsa

botsa satyanarayana, pcc chief botsa, congressparty high command, sonia gandhi, cm kiran kumar reddy, mla's suspension issue, high command fire on botsa, cm vs botsa, congress group politics, ap politics,

party high command fire on botsa

11.gif

Posted: 02/06/2013 07:31 PM IST
Party high command fire on botsa

bothsa_e

       సత్తిబాబు తీరు చూస్తుంటే.. అవుననే అనిపిస్తుంది.. ఎందుకంటే.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని ఇటీవల వస్తోన్న వార్తలకు బలం చేకూరేలా బొత్స వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించామని సత్తిబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.
      అంతేకాదు..  ఎంత మంది ఎమ్మెల్యేలను బహిష్కరించారన్న ప్రశ్నకు 9 మంది ఎమ్మెల్యేలను అంటూ బొత్స సమాధానం కూడా ఇచ్చారు. ఆ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద వివాదం చెలరేగింది. పార్టీ అధ్యక్షుడైన బొత్స నేరుగా కిరణ్ సర్కారు మైనార్టీలో కొనసాగుతోందనే సంకేతాలిచ్చారంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి వర్గం కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. పిసిసి అధ్యక్షుడు తీరును వివరిస్తూ హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది.
        దీంతో అధిష్టానం పెద్దలు బొత్సకు చీవాట్లు పెట్టారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి బొత్స పార్టీకి అనవసర తలనొప్పులు తెస్తున్నారనే అభిప్రాయంలో ఉన్న హైకమాండ్ త్వరలో అతన్ని తప్పిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక రెండు రోజులుగా బొత్స మిడియా ప్రతినిధులు కలిస్తే చాలు చిరాకు పడుతున్నారు. 9మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తానంటూ తను యథాలాపంగా చెప్పిన మాటలకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చారంటూ అసహనం వ్యక్తం చేసారు.  దీంతో మొత్తానికి ఏదో పెద్ద తలంటే జరుగుంటుందని జర్నోలంతా భావిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor may skip osmania university convocation
Chargesheet on swamy goud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles