Bjp organises dharna fast against shinde hindu terror remarks

bharatiya janata party, hindu terror, protests, bjp, sushilkumar shinde, rss, rajnath singh, mla kishan reddy, bjp leaders

BJP organises dharna-fast against Shinde Hindu terror remarks

BJP.gif

Posted: 01/24/2013 03:33 PM IST
Bjp organises dharna fast against shinde hindu terror remarks

BJP organises dharna-fast against Shinde Hindu terror remarks

దేశంలో తొమ్మిదేళ్లుగా అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీకి  భారత సమైక్యత, సమగ్రత పట్ల ద్రుష్టి  లేదని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి అన్నారు.   అడ్డదారుల్లో  ఓటు బ్యాంకు రాజకీయాలతో  2014 ఎన్నికల్లో  కేంద్రంలో  అధికారంలోకి రావడమే లక్ష్యంగా  పెట్టుకుందని  మండిపడ్డారు.  భారత  సైనికులను పాకిస్థాన్  వూచకోత కోస్తే..  ఇటీవల  జైపూర్ లో  జరిగిన కాంగ్రెస్  మేథోమథనంలో  కనీసం  చర్చకు రాలేదని  ధ్వజమెత్తారు.  వందకోట్ల  మంది హిందువులపై ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ ఒవైసీ యుద్దం ప్రకటిస్తే  స్పందించలేదని విమర్శించారు.  దేశ ప్రజానీకం  ఎదుర్కొంటున్న  అనేక సమస్యలను  పరిష్కరించకుండా  బీజేపి, ఆర్ ఎస్ ఎస్ లపై అనుచిత వ్యాఖ్యలు  చేయటాన్ని  తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాకుండా తెలంగాణ సమస్యను ఈ నెల 28న కేంద్రం  ఒక ప్రకటన చేస్తుందనే నమ్మకంతో  అన్ని పార్టీ నాయకులు  ఆశగా ఉన్నారు. కానీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. తెలంగాణ నాయకులు మాత్రం ఆజాద్ వ్యాఖ్యలకు అర్థం లేదని అంటున్నారు.  బిజేపి పార్టీ నాయకులు మాత్రం  ఢిల్లీలో పెద్ద ఎత్తున  ఆందోళన చేపట్టారు.  ఆజాద్  వ్యాఖ్యలు  సరికావు అంటూ నినాదాలు చేశారు.  అంతేకాకుండా  తెలంగాణ పై అధికారి ప్రకటన ఇచ్చినందుకు  షిండే ను  పదవి నుంచి తొలిగించాలని  బీజేపి  నాయకులు  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  నిరసన చేపట్టారు.  ఆయా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్‑ఎస్‑లపై కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్‑రావు, దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ షిండేను తక్షణమే బర్తరఫ్ చేయాలని, లేకుంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొవాలని సవాల్ విసిరారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp asaduddin owaisi gets bail
Jc diwakar reddy comment on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles