Kcr fires at azad s telangana statement

k chandrasekhar rao, telangana rastra samithi, telangana,

Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has lashed out at Congress leader Ghulam Nabi Azad's Telangana statement

kcr fires at azad s telangana statement.png

Posted: 01/24/2013 11:50 AM IST
Kcr fires at azad s telangana statement

kcrకేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలంగాణ ప్రకటన ఈ నెల 28 తేదీన రాదని తేల్చి చెప్పిన వ్యాఖ్యల పై తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే మోసం చేస్తుందని మేం ముందే ఊహించామని, అఖిల పక్ష సమావేశాన్ని పనికిమాలిన సమావేశం అని మేం ముందే పేర్కొన్నామని,  తెలంగాణలోని అన్ని స్థాయిల్లోని కాంగ్రెస్ నాయకులకు చీము, నెత్తురు ఉంటే ఇప్పటికైనా ఆ పార్టీ విషకౌగిలి నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని, లేదంటే కాలగర్భంలో కలిసి పోతారని కెసిఆర్ అన్నారు. కాగా మరో నేత హరీష్ రావు జరగబోయే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ హోం మంత్రి మాటకు కూడా విలువ ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే, కిసిఆర్ కుమారుడు అయిన తారకరామారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తను పెట్టిన గడువుకు తానే కట్టుబడలేదన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో చలగాటం ఆడడం ఇకనైనా మానుకోవాలని ఆయన అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kvp stops t formation
No separate telangana statement lagadapat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles