One month does not mean 30 days says azad

ghulam nabi azad, telangana, samaikyandhra, sonia gandhi, new delhi

Central Minister Ghulam Nabi Azad has responded on Telangana issue on Wednesday. He said Congress is seriously thinking about Telangana issue

One month does not mean 30 days-says Azad.png

Posted: 01/24/2013 09:52 AM IST
One month does not mean 30 days says azad

Azadకాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ ఆశల పై నీళ్ళు చల్లింది. గత నెల నిర్వహించిన అఖిల పక్ష భేటీ తరువాత నెల రోజుల్లో తెలంగాణ పై ప్రకటన ఇస్తామని హోంమంత్రి చెప్పిన విషయం తెలిసిందే. అయితే గడువు దగ్గర పడుతున్న కొద్ది ఉఠ్కంట పెంచిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి నిన్న ఈ నెల 28వ తేదిలోగా పరిష్కరిస్తారనే వాదనకు  కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెర దించారు. గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కారానికి కొంత సమయం అవసరం అన్నారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినంత మాత్రాన ఇప్పుడు ప్రకటన చేయలేం అని అజాద్ వ్యాఖ్యానించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. జాతీయస్థాయిలో తెలంగాణపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తీవ్రంగా చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నారు. మీడియా అడిగినంత సులభంగా తెలంగాణపై నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని అన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయని చెప్పారు. చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సోనియాతో చర్చించిన అంశాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఆజాద మాటలను తెలంగాణవాదులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No separate telangana statement lagadapat
Sonia discusses telangana issue with senior party leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles