Gas cylinders subsidy increased from 6 to 9

Gas cylinders subsidy increased from 6 to 9, Gas cylinders subsidy, Gas cylinders subsidy in Ap, Gas cylinders subsidy in Andhra pradesh

Gas cylinders subsidy increased from 6 to 9, Gas cylinders subsidy.

Gas cylinders subsidy increased from 6 to 9.png

Posted: 01/17/2013 03:51 PM IST
Gas cylinders subsidy increased from 6 to 9

gas_cylindersగత ఏడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీ సిలెండర్ల సంఖ్యను ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సిలిండర్లను ఆరు నుండి తొమ్మిదికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఏప్రిల్‌ నుంచి అమలుల్లోకి వస్తుందని ప్రకటించింది. సిలిండర్ల కుదింపు  నిర్ణయంపై మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. విపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సిలిండర్లను 9కి పెంచకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ దెబ్బతింటుందని ప్రభుత్వ పెద్దలు గ్రహించిన నేపథ్యంలోనే సబ్సిడీ సిలిండర్లను 9కి పెంచాలని కేంద్రం రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. గుజరాత్‌ ఎన్నికల సమయంలోనే సిలిండర్లను 9కి పెంచాలని ప్రయత్నించింది. అయితే అప్పట్లో ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరం రావడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా సబ్సిడీ సిలిండర్ల పెంపు విషయాన్ని ఎన్నికల సంఘానికి వివరిస్తూ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో సామాన్యుడికి కాస్తంత ఊరట లభించినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana fires on gade
T jac attacked by danam nagender  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles