Telangana without hyderabad rayapati

rayapati sambasiva rao, telangana, chandrababu naidu, ys jagan, hyderabad

Guntur MP Rayapati Sambasiva Rao said on Tuesday that Seemandhra people will not accept Telangana with Hyderabad

telangana without hyderabad rayapati.png

Posted: 01/15/2013 07:42 PM IST
Telangana without hyderabad rayapati

Rayapatiగుంటూరు ఎంపీ అయిన రాయపాటి సాంబ శివరావు తెలంగాణ వాదానికి బద్ద శత్రువులలో ఒకరు. కానీ ఈయనే నేడు తెలంగాణకు కాస్త అనుకూలంగా మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ అంశం లేవనెత్తినా భగ్గుమనే రాయపాటి ఈ సారి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే తనకు అభ్యంతరం లేదని తన వ్యక్తిగత అబిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఈయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధిష్టానం విధించిన గడువు లోపు తెలంగాణ అంశాన్ని తేల్చుతుందనే నమ్మకం మాత్రం లేదని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదని, ఏదో పార్టీని కాపాడుగోవడానికి గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని, ఆయన కూడా తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పలేదన్నారు. కాగా ఈ నెల పదిహేడున హైదరాబాద్ లో జరుగుతున్న సీమాంద్ర నేతల సమావేశాన్ని అడ్డుకుంటానని కవిత అనడాన్ని ఆక్షేపిస్తూ, అలా చేయడానికి ఆమె ఎవరు అని రాయపాటి ప్రశ్నించారు. రాయపాటి తెలంగాణకు కాస్త అనుకూలంగా మాట్లాడిన, హైదరాబాద్ లేని తెలంగాణను తెలంగాణ వాదులు ఒప్పుకోరన్న సంగతి అందరికి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayyanna patrudu as tdp politburo member
Pak sc orders arrest pm raja pervez ashraf  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles