Mla gurunath reddy comments

gurnath reddy, kk mahender reddy, sailajanath, telangana, samaikyandhra, ys jagan, hyderabad

Differences took place in YS Jaganmohan Reddy's YSR Congress party on Telangana issue

YSRCP MLA Gurunath Reddy.png

Posted: 01/15/2013 07:24 PM IST
Mla gurunath reddy comments

gurunath-reddyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ చిచ్చు రేగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనంతపురం ఎమ్మెల్యే అయిన గురునాథ రెడ్డి తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. ఈ వ్యాఖ్యల పై పార్టీ నాయకత్వం ఆయనకు అంక్షింతలు వేసినట్లు వార్తలు. అసవసర వ్యాఖ్యలు చేసి పార్టీలో గందరగోళం సృష్టించవద్దని , తమ అబిప్రాయాన్ని పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కొత్త గా వివాదాలు రేకెత్తించవద్దని పార్టీ ఆయనకు సూచించినట్లు సమాచారమ్. ఇక ముఖ్యంగా విజయమ్మ జగన్ విడుదల కోసం చేసిన సంతకాలను పట్టుకొని ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనను పార్టీ ముఖ్య నాయకులు మందలించారని అంటున్నారు. ఇక అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం చెప్పిందని, అన్ని ప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే తాము లేఖ ఇచ్చినట్లు పార్టీ ముఖ్య నేతలలో ఒకరు అయిన కెకె మహేంద్ర రెడ్డి చెప్పారు. పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak sc orders arrest pm raja pervez ashraf
Anam ram narayan reddy comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles