Palvai govardhan reddy fires on komatireddy

Palvai Govardhan Reddy, Komatireddy, Palvai Govardhan reddy fires on Komatireddy, komatireddy brothers, komatireddy venkata reddy, congress party, senior leader, telangana issue,

Palvai Govardhan reddy fires on Komatireddy

Palvai Govardhan.gif

Posted: 01/03/2013 04:27 PM IST
Palvai govardhan reddy fires on komatireddy

Palvai Govardhan reddy fires on Komatireddy

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మండిపడ్డారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఎద్దెవా చేశారు. తెలంగాణవాది అయితే వైఎస్సార్ సీపీలోకి ఎట్ల వెళ్తాడని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలోకి వెళ్లాలనుకున్నా ఆయన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ వెనక్కి తగ్గారని చెప్పారు. తెలంగాణ ద్రోహి అయిన కోమటిరెడ్డి ఇంటికి కేకే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వెంకట్‌రెడ్డికే క్లబ్‌లు, ఇసుక దందాలు ఉన్నాయని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రా నాయకుల ఒత్తిడి ఉన్నా తెలంగాణ కావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గట్టిగా వినిపించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోపిడీదారులే అడ్డంకి అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజలెవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదన్నారు. లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావును తెలంగాణ ప్రజలు ఎవరైనా కొట్టారా, వారి ఆస్తులను లూటీ చేశారా అని ప్రశ్నించారు. వారు తెలంగాణను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  West bengal chief minister mamata banerjee
T activists attacked stones eggs on chandrababu padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles