Ajmal kasab hanged at yerwada jail in pune

ajmal kasab hanged at yerwada jail in pune,president pranab mukherjee,yerwada jail,pune,pranab mukherjee, pakistan, mumbai attacker,filmed,ajmal kasab,26/11, pakistan terrorist ajmal kasab, hanged to death, pune yeravada jail, execution, president, rejected his mercy petition, mumbai, blasts case, 26/11 161 dead, so many injured

Ajmal Kasab hanged at Yerwada Jail in Pune

Ajmal.gif

Posted: 11/21/2012 09:42 AM IST
Ajmal kasab hanged at yerwada jail in pune

Ajmal Kasab hanged at Yerwada Jail in Pune

ముంబయి దాడుల కేసులో మరణ శిక్ష పడ్డ పాక్  జాతీయుడు  అజ్మల్ కసబ్ పెట్టుకున్న  క్షమాభిక్ష  అభ్యర్థనను రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.  నవంబర్ 8న  క్షమాభిక్ష  పిటిషన్ ను తిరస్కరించినట్లు రాష్ట్రపతి  భవన్ వర్గాలు కేంద్ర  హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశాయి. 2008, నవంబర్ 26న ముంబయి నగరంలో  కసబ్ తో పాటు 9 మంది ఉగ్రవాదుల నరమేథానికి  పాల్పడిన ఘటనలో 166 మంది మరణించారు. ఆ మారణహోమం  ఘటనలో  సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కు  ఉరిశిక్ష ను అమలు చేసినట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి  ఆర్ ఆర్  పాటిల్  తెలిపారు.   కసబ్ కు ఉరిశిక్ష అమలుపై  ఆయన ముంబయిలో మీడియాతో  మాట్లాడారు.  కసబ్  పెట్టుకున్న  క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి  తిరస్కరించిన అనంతరం ఈ ఉదయం 7.30 గంటలకు ఫుణేలోని ఎర్రవాడ జైల్లో  మరణ శిక్షను  జైలు అధికారులు అమలు పరిచినట్లు ఆయన వెల్లడించారు. రెండు రోజుల క్రితమే కసబ్ ను ఎరవాడ జైలుకు తరలించినట్లు చెప్పారు.

Ajmal Kasab hanged at Yerwada Jail in Pune

కసబ్ కేసు వివరాలు

1.2008 నవంబర్ 26న జరిగిన ముంబయి దాడుల ఘటనలో ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టివేత

2. 2010, మే 3న కసబ్ పై ట్రయల్ కోర్టులో నేర నిర్థారణ, హత్య దేశంపై  యుద్ద కుట్ర కేసు నమోదు

3. 2010, మే 6న కసబ్ కు మరణ శిక్ష విధించిన అదే కోర్టు

4.2011, ఫిబ్రవరి 21న బాంబే హైకోర్టు కసబ్ మరణ శిక్షను సమర్థించింది

5. 2012, ఆగస్టు 29న కసబ్ కు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు  ఖరారు చేసింది.

6. 2012, సెప్టెంబర్ 18న రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న కసబ్

7. 2012, నవంబర్ 8న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు

8. క్షమాభిక్ష తిరస్కరన అనంతరం 2012 నవంబర్ 21న కసబ్ కు ఉరిశిక్ష అమలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasab hanged what about afzal guru asks bjp
Bjp leader venkaiah naidu comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles