Vishnu complaint on brahmins

manchu vishnu complains to HRC , vishnu complaint in Hrc, vishnu complaint on Brahmins , brahmins complaint to hrc, vishnu movie denikaina ready, manchu vishnu movie controversy, hrc respons to actor vishnu, Manchu Vishnu Approaches HRC, Human Rights Commission,

vishnu complaint on Brahmins

manchu.gif

Posted: 11/03/2012 02:52 PM IST
Vishnu complaint on brahmins

manchu vishnu complains to HRC

దేనికైనా రెడీ  సినిమా వివాదం ముదిరిపోయింది.  మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణల పై దాడి చేయటం , బ్రాహ్మణ సంఘలు మోహన్ బాబుకు పిండ ప్రదానం చేయటం జరిగాయి. అయితే బతికుండగానే తన తండ్రి మోహన్‌బాబుకు పిండ ప్రదానం చేసిన బ్రాహ్మణ సంఘంపై చర్యలు తీసుకోవాలని ఆయన కుమారుడు, సినీ నటుడు విష్ణు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన న్యాయవాదుల ద్వారా ఫిర్యాదును హెచ్చార్సీకి పంపించారు. దీనికి స్పందించిన హెచ్చార్సీ జ్యుడిషియరీ సభ్యుడు మిర్యాల రామారావు ఈ నెల 16వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.  తన తండ్రి 550 చిత్రాలలో నటించారని, నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు గడించారని అందులో పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్‌టీ రామారావు ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్ల పాటు సేవలందిచారని తెలిపారు. ఎంతో ఉన్నత ప్రమాణాలతో దేనికైనా రెడీ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఈ సినిమా సెన్సార్డ్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిందన్నారు. కొందరు బ్రాహ్మణ సంఘం పేరుతో తన ఇంటి ముందు ధర్నా చేశారని, సజీవంగా ఉన్న తన తండ్రికి గుంటూరు బ్రాహ్మణ సంఘానికి చెందిన బ్రాహ్మణులు శ్రీధర్, కోనేరు సతీష్‌శర్మ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేసి తమ హక్కులకు భంగం కలిగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anam viveka happy to chiru union cabinet
Pranab to corruption fight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles