Tdp leaders comment on jaipal reddy

tdp leaders comment on jaipal reddy, Tdp leaders, tdp leaders gali, mothukupall, Tdp leaders comment on congress party, central minister jaipal Reddy, Cm kiran kumar reddy, Bosta satyanarayana, pcc chief, Sonia gandhi, new ministers,

tdp leaders comment on jaipal reddy

tdp.gif

Posted: 10/30/2012 11:06 AM IST
Tdp leaders comment on jaipal reddy

tdp leader gali comment on jaipal reddy

కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి రాజీనామా చేసి ఆంధ్ర పౌరుషాన్ని చూపించాలని టిడిపి డిమాండ్ చేసింది. నిబంధనల మేరకు పని చేసినందుకే జైపాల్ శాఖను మార్చారని టిడిపి ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఒక కంపెనీ (రిలయన్స్) ఒత్తిడి మేరకు జైపాల్‌ని మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. పెట్రోలియం శాఖ నుంచి ప్రాధాన్యత లేని శాఖకు మార్చడం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని అన్నారు. 1978 నుంచి 1983 వరకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరోసారి అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నడివీధిలో తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పది మంది బిసి ఎంపిలు ఉండగా కేవలం ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి న్యాయం జరగలేదని, సహాయ మంత్రులకు విమానంలో ఉచితంగా ప్రయాణించే సదుపాయం మినహా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎంపిలు, మంత్రులు కేంద్రం నుంచి ఒక్కపైసా తేలేకపోతున్నారని విమర్శించారు. మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రిని అవమానించారని, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షునికి ఎలాంటి సమాచారం లేకుండానే మంత్రులను నియమించారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna hazare to announce new team
Earth quake in krishna guntur and khammam districts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles