Andhra pradesh congress worried over slump in affairs

General Public,Chief, Minister, Botsa Satyanarayana, Andhra Pradesh, Chiranjeevi, Membership, Congress party, Congress MP

Andhra Pradesh Congress worried over slump in affairs

Congress.gif

Posted: 10/19/2012 12:09 PM IST
Andhra pradesh congress worried over slump in affairs

Andhra Pradesh Congress worried over slump in affairs

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు విభేదాలు విస్మరించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వానివేనని ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పిలుపునిచ్చారు. ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేదికపై పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న సమైక్యవాద ఎంపీలు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ వాదులైన మాజీ ఎంపి కె కేశవరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తొలి సభ్యత్వాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వీకరించారు. అనంతరం బొత్స సత్యనారాయణ నుంచి పార్టీ సభ్యత్వాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపి చిరంజీవి స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. అధికారదాహంతో కొమ్మలను నరికే వారికి ప్రజల ఆదరణ లభించిందన్నారు. కొత్త పార్టీలకు బలమైన పునాదులు లేవని, వేర్లు లేని చెట్ల మాదిరిగా నేలవాలుతాయని ఆయన అన్నారు.

Andhra Pradesh Congress worried over slump in affairs

సామాజిక న్యాయం, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ అధికారుల్లో అవినీతి బాగా పెరిగిందని, వీరిని జైలుకు పంపాలని లేదా సస్పెండ్ చేయాలన్నారు. అవకాశవాదులను దగ్గరకు చేరనివ్వరాదన్నారు. పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వాలన్నారు. ఒక లక్ష మంది సుశిక్షుతులైన కార్యకర్తలను తయారు చేస్తే వారే పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి కె కేశవరావు తెలంగాణ అంశంపై పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీకి కాంగ్రెస్ కట్టుబడి అమలు చేయాలని కోరారు. పార్టీని బూత్ స్ధాయి నుంచి బలోపేతం చేసేందుకు అన్ని సెల్స్ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. మంత్రి ధర్మానప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీల నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కావాలన్నారు. మండల స్ధాయి నుంచి పార్టీ ప్రత్యర్ధులను మట్టికరిపించేందుకు వ్యూహాలు అవసరమన్నారు. ప్రాంతీయ పార్టీల్లోని ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలన్నారు. జాతీయవాదానికి ప్రతీకగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల సభ్యత్వ నమోదు గాంధీభవన్‌లో ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు పత్రాన్నిఅందించి చిరంజీవి నుంచి ఐదు రూపాయల నాణెం తీసుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి. పక్కనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mla shankar rao
Telugu newspaper rate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles