Gas cylender price hike

gas cylender price hike

gas cylender price hike

1.png

Posted: 10/07/2012 12:53 PM IST
Gas cylender price hike

gas_eee

వంటగ్యాస్‌ ధర శనివారం నుండి సిలిండర్‌కు రూ.11.42 చొప్పున పెరిగింది. ఎల్‌పిజి డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు చమురు కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపాయి. కమిషన్‌ను పెంచాలని గ్యాస్‌ డీలర్లు చేసిన ఒత్తిడి మేరకు ఒక్కో సిలిండర్‌పై ఇప్పుడిస్తున్న రు.25.83పైసల కమిషన్‌ను రు.37.25 పైసలకు పెంచింది. దీంతో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఢిల్లీలో రు.410.42, ముంబయిలో రు.434.42 , కొల్‌కతాలో 412.42, చెన్పైలో 397.92కి పెరిగింది.
        స్థానిక లెవీ రేట్లను బట్టి గ్యాస్‌ సిలిండర్‌ ధర రాష్ట్రానికో విధంగా ఉంటోంది. సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం ఉన్న రు.883.5 నుంచి 921.5కు పెరిగింది. వంటగ్యాస్‌ డీలర్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్‌ డీలర్ల కమిషన్‌ పెంపుదలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్‌ డీలర్‌కు లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు పది పైసలు చొప్పున కమిషన్‌ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్యాస్‌ తరహాలోనే ఈ పెంపుదల భారం కూడా పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుదల రూపంలో అంతిమంగా వినియోగదారులపైనే పడుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సబ్సిడీ సిలిండర్ల సరఫరాను ఏడాదికి ఆరుకు కుదించాలని ప్రభుత్వం నిర్ణయించిన కొద్ది వారాల్లోనే గ్యాస్‌ ధర పెరగటం విశేషం.
       ఇంకోవైపు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ల ఒత్తిడి మేరకు ఒక ఇంటికి ఒకటే కనెక్షన్‌ అన్న మెలిక పెట్టి ఇప్పుడున్న 14 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లలో ఒకటిన్నర కోట్ల కనెక్షన్లను తొలగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నా ఒక కనెక్షన్‌ తోనే గడపాలి. దీనికి అంగీకరించి అక్టోబరు 31కల్లా అదనపు కనెక్షన్లను అప్పగించాలని, లేని పక్షంలో ఆ కనెక్షన్లకు గ్యాస్‌ సరఫరా నిలిపేస్తామని బెదిరిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bio diversity conference hyderabad
Ajith sing new party in andhrapradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles