Ysjagan wife bharathi

Y.S.Jagan wife Bharathi

Y.S.Jagan wife Bharathi

Bharathi.gif

Posted: 10/05/2012 09:09 PM IST
Ysjagan wife bharathi

Y.S.Jagan wife Bharathi

వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు చాలా బాధపడినట్లు తెలుస్తోంది. వారు ఈ రోజు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఎంతో ఆశగా చూసిన వారికి  మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు జగన్‌ని జైలులో చూసి చాలా బాధగా అనిపించింది. ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్న మనిషిని అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారు. మీకు ఇది ఆట కావచ్చు. చదరంగం కావచ్చు. కాని భర్తను పోగొట్టుకొన్న ఒక తల్లికి- ఆమె బిడ్డను- చేయని నేరానికి జైలులో పెడితే ఎలా ఉంటుంది? మీకు తల్లులు లేరా? పసిపిల్లలకు- తమ తండ్రిని ఇంతమంది వికృతంగా చుట్టుముట్టి ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ల లేత మనసులు ఆవేదనతో అల్లాడవా? మీకు పిల్లలు లేరా? ఇంటికి, జీవితానికి అండగా ఉండే భర్తను తీసికెళ్లి అన్యాయంగా జైలు పాలు చేశారే... అదే మీ భార్యలకు అలాంటి పరిస్థితి వస్తే? మీ వరకు వస్తేకాని తెలీదు ఆ బాధ, ఆ దుఖం, ఆ వేదన. అయినా ఏ తల్లికి, ఏ బిడ్డలకు, ఏ భార్యకు ఇటువంటి కష్టం రాకూడదని దేవుణ్ణి వేడుకొంటున్నాను. దేవా! పగవాళ్లకు కూడా వద్దు ఇటువంటి బాధ.

అసలు వాస్తవం ఏమిటంటే జగన్‌కు అస్సలు సంబంధం లేని విషయంలో జగన్‌ను జైల్లో పెట్టారు. నీ కంపెనీ షేర్లను ఎక్కువ రేటుకు అమ్మినావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టామంటే ఈ దేశంలోని టాటాలు, అంబానీలు, జీఎమ్మార్‌లు అందరూ జైల్లో ఉండాలి. మన చంద్రబాబుగారి హెరిటేజ్ దగ్గర నుండి ఈనాడు రామోజీరావు వరకు అందరూ షేర్స్ ఎక్కువ రేటుకు అమ్ముతారు. మరి అలాంటిది జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారు అనే మా ప్రశ్నకు సమాధానం దొరకదు. అసలు ఎందుకు మా సంస్థల మీదికి వచ్చారు? విచారణ అన్నారు... ఎవరో లెటర్ రాశారని (అందునా లెటర్ రాసింది మా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే)... దానికి ఎవరు జతకట్టారని (అది కూడా మా ప్రత్యర్థులే) మా మీదికి వచ్చి ఇంతగా వేధించుకు తింటున్నారు. మా కుటుంబాన్ని- మామగారి మరణం నుండి ఇంకా కోలుకోలేక పోతున్న మా కుటుంబాన్ని ఇంత నరక యాతనకు గురి చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మన దేశ పెద్దల సంస్కారం ఇదేనా? మన విచారణ సంస్థల నిస్పక్షపాతం ఇదేనా?

అయినా దేవుడు చూస్తున్నాడు. వాళ్ల కుట్రలు చూస్తున్నాడు. మా బాధలను చూస్తున్నాడు. తప్పక వాళ్ల కుట్రలను భగ్నం చేసి మమ్మల్ని ఆదరిస్తాడు. రామాయణంలో రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులపాలై తిరిగి వచ్చి రామరాజ్యం అందించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rambabu
Fire accident in vanasthalipuram at hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles