Srisailam shivaji gopuram fell down

Srisailam Shivaji Gopuram Fell Down,Srisailam Temple's Shivaji Gopuram Top Collapsed,

Srisailam Shivaji Gopuram Fell Down

Srisailam.gif

Posted: 10/05/2012 05:52 PM IST
Srisailam shivaji gopuram fell down

Srisailam Shivaji Gopuram Fell Down

మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జైత్రయాత్రలకు శ్రీశైల పుణ్యక్షేత్రంలోని ప్రధాన ఆలయ ఉత్తర ద్వార ప్రాకార గోపురం చిహ్నంగా నిలుస్తోంది. శ్రీశైలక్షేత్రానికి, శివాజీకి ఉన్న అనుబంధాన్ని ఈ గోపురం తెలియజేస్తోంది. శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లంటే శివాజీకి అత్యంత భక్తిభావం ఉండేది. 16వ శతాబ్దంలో శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో ఆలయానికి 104అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం మూడున్నర శతాబ్దాల తర్వాత శిథిలమైంది. దీంతో 1967లో అప్పటి ప్రభుత్వం గోపురానికి మరమ్మతులు చేపట్టిందిశిథిలమైన శివాజీ గోపురం... గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేలకూలింది. పుట్టుకతోనే వీరుడి లక్షణాలను పుణికి పుచ్చుకున్న మహాయోధుడు ఛత్రపతి శివాజీ. 1644లో 16ఏళ్ల నూనూగు మీసాల వయసులోనే తోరణ్ దుర్గాన్ని జయించి తను స్థాపించబోయే హిందూ సామ్రాజ్యానికి శంకుస్థాపన చేశారు.

Srisailam Shivaji Gopuram Fell Down

1677లో సైన్య సమేతుడై కర్ణాటక దిగ్విజయ యాత్రకు బయలుదేరి మార్గమధ్యలో శ్రీశైల క్షేత్ర సందర్శనకు వచ్యారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించిన సమయంలో ఏర్పాటు చేసుకున్న ధ్యాన మందిరంలో పది రోజులపాటు ఇక్కడే ఉండి భ్రమరాంబదేవి కృప కోసం దీక్ష చేపట్టారు.ఈ క్రమంలో 10వ రోజున అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించి ధర్మ సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పి ఆశీర్వదించినట్లు చరిత్ర చెబుతోంది. తన పేరిట శ్రీశైల ఆలయానికి గోపురం నిర్మించాలని జనార్దనపంత్‌ను ఆజ్ఞాపించినట్లు, దీంతో ఆయన అక్కడే ఉండి ఆలయానికి ఉత్తర దిక్కుగా గోపుర నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ గోపురమే శివాజీ గోపురంగా ప్రసిద్ధికెక్కింది. శివాజీ స్మృతికి గుర్తుగా ఆయన తపమాచరించిన ధ్యానమందిరం ఉన్న స్థలంలో స్ఫూర్తి మందిరాన్ని నిర్మించారు.1983లో అప్పటి మహారాష్ట్ర సీఎం వసంత్‌దాదాపాటిల్ స్ఫూర్తికేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఇందులో శివాజీ సింహాసనంపై ఆశీనులైన భారీ విగ్రహం ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The world top 100 universities 2012
Facebook now has more than 100 crore users  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles