Telangana movement

Telangana movement, Money, Telangana leader, TRS party, Congress Party leader, Money power,

Telangana movement

Money.gif

Posted: 10/04/2012 08:24 PM IST
Telangana movement

Telangana movement

కాంగ్రెస్‌కు తెలంగాణ మీద ప్రేమ లేదని, ఓ వైపు తెలంగాణ మార్చ్‌కు అనుమతిచ్చి మరో వైపు కేసులు పెట్టడం సమంజసం కాదని టఫ్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టఫ్ చైర్మన్ కేశవరావు జాదవ్, సెక్రటరీ జనరల్, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడారు. రాజధానిలో ఉద్యమం, రాష్ట్రంపై ఎలాంటి కదలికలు లేవని, ప్రధాన మంత్రి, సోనియా గాంధీ మాట్లాడటం లేదని కేశవరావు జాదవ్ అన్నారు. కొందరు కేంద్ర మంత్రులు తెలంగాణపై హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

కోస్తాలో ఏమి మ్యాజిక్ ఉందో తెలియదని మనీపవర్ ద్వారా కొంత మంది రాష్ట్రాన్ని ఆపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ మార్చ్ విజయవంతం అయిందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అన్నారు. కేంద్ర హోంమంత్రి కూడా ప్రశాంతంగా మార్చ్‌ను నిర్వహించారని కితాబుచ్చిన ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ఉద్యమ కారులపై లాఠీలు జులిపించడం దారుణమన్నారు. టఫ్ నాయకులపైన, జేఏసీ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని మార్చ్‌లో పాల్గొనాలని కోదండరాం అహ్వానించారని, దానికి అనుగుణంగా తాము పాల్గొన్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆలస్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించి మార్చ్‌కు మద్దతు తెలిపిందన్నారు. సమావేశంలో విమలక్క ఢిల్లిలో ఉండాల్సిన అవసరం లేదని, ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటే తెలంగాణ రాదని, ఇక్కడ ఉండి రాళ్లు పట్టుకొని తెలంగాణ సాధించాలని, కార్యక్షేత్రం ఇక్కడ కాబట్టి ఇక్కడే ఉండి పోరాటం చేయాలని మాత్రమే అన్నారన్నారు.

ఎవరిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు కావని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం చర్చల ద్వారా రాదని, చర్చించాలనుకుంటే రహస్య చర్చలు కాదు బహరింగ చర్చలు జరగాలన్నారు. మార్చ్ ద్వారా జేఏసీకి ఉద్యమాన్ని నడిపించే శక్తి ఉందని రుజువు చేసిందన్నారు. కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆత్మగౌరవాన్ని ఢిల్లిలో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. నిర్ధిష్టమైన, స్పష్టమైన ప్రణాళికా అవసరమని, ఐక్యమత్యాన్ని కొనసాగించాలని దిలీప్ అన్నారు. కాంగ్రెస్ పార్టీది మోసం చేసే తత్వమని నమ్మించి నిండా ముంచుతుందన్నారు. ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తన అధికారాన్ని ఉద్యమాన్ని తొక్కి పెట్టడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఉద్యమ కారులు పరిధి దాటారు అనే హక్కు సీఎంకు లేదన్నారు. సమావేశంలో టఫ్ నాయకులు శేషగిరిరావు. రియాజ్, సోహ్రాబేగం, స్నేహ, నిర్మల పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  South india shopping mall seized
Tdp blows war bugle  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles