The brand arvind kejriwal dilemma

The brand Arvind Kejriwal dilemma

The brand Arvind Kejriwal dilemma

Arvind.gif

Posted: 10/04/2012 08:00 PM IST
The brand arvind kejriwal dilemma

The brand Arvind Kejriwal dilemma

సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, యోగా గురువు బాబా రామ్‌దేవ్‑లు చెప్పే మాటలు వింటుంటే వారు పగటి కలలు కంటున్నారనిపిస్తోంది. పార్లమెంటులో ముఖాలను మార్చడం కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను రాజకీయ పార్టీ పెడితే పార్లమెంటుకు 400 మంది ఎంపీలను పంపుతానని రామ్‑దేవ్ చెప్పారు. ఇవన్నీ ఆచరణలో సాధ్యమేనా? ఈ దేశంలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వారికి తెలియదనుకోవాలా? అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత తేలికనుకుంటున్నారా? ఈ వ్యవస్థని మార్చడం అంత సులువా? ప్రజలకు ఏం చెబుతున్నారో, వారికి ఎటువంటి ఆశలు కల్పిస్తున్నారో వారికి అర్థమవుతుందా? అసలు ప్రజలు వారి మాటలను నమ్ముతున్నారా? అన్న అనుమానం కూడా రాకమానదు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జన్‑లోక్‑పాల్ ఉద్యమంలో భాగంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ అలుపెరుగని పోరాటం చేశారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. దేశం నలుమూలల నుంచి మంచి స్పందన కనిపించింది. పలు రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు మద్దతు పలికారు. ఉద్యమ తీవ్రతను చూసి దేశంలో అవినీతి అంతమయ్యే కాలం దగ్గరపడిందని ప్రజలు భ్రమపడ్డారు. వారి ఆశలు ఎంతో కాలం నిలవలేదు.రాజకీయ విప్లవంతోనే జన్‑లోక్‑పాల్ సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఆయనకు మరికొందరు తోడయ్యారు.

The brand Arvind Kejriwal dilemma

ప్రారంభంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అన్నా హజారే ఆసక్తి చూపినా, ఆ తరువాత ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఆయన అనుచరులు కేజ్రీవాల్‑, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా వంటివారు విడిపోయి రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీ అనగానే ఉద్యమంలో ఊపుతగ్గింది.పార్టీ పెట్టినా తన పేరుగాని, ఫొటో గాని వాడుకోవడానికి కేజ్రీవాల్ మద్దతుదారులకు అన్నా హజారే అనుమతి ఇవ్వలేదు. వీరిద్దరూ విడిపోవడం వల్ల ఉద్యమం బాగా బలహీనపడింది. ఇప్పుడు జన్‑లోక్‑పాల్ మద్దతుదారులకు ఎటువెళ్లాలో అర్ధంకాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇటు రాజకీయాలలోకి దిగాలా? అటు అన్నా హజారే వెంట ఉండాలా? అన్న ఆలోచనలో పడ్డారు.వీరిద్దరూ సామాన్యమైన వ్యక్తులు ఏమీకాదు. వేరు రంగాలలో అనుభజ్ఞులే. రాజకీయాలు, సమాజం పట్ల అవగాహన ఉన్నవారే. నీతిమంతులను, నిజాయితీ పరులను ఈ ప్రజలు ఎన్నుకుంటారా? ఈ వ్యవస్థలో వారు గెలవగలరా?ప్రజలు సంపూర్ణ మద్దతు పలికినా అతికొద్ది కాలంలోనే జన్‑లోక్‑పాల్ ఉద్యమంలో చీలిక వచ్చింది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినవారు విడిపోయారు. ఈ నేపధ్యంలో అవే ఆశయాలతో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ దీర్ఘకాలం మనగలుగుతుందా అన్న సందేహం రాకమానదు. మనగలిగినా అధికారం చేజిక్కించుకోగలుగుతుందా?రాజకీయంగా పండిపోయిన దిగ్గజాలు ఈ ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఒక కూటమి కూలిపోతే మరో కూటమి అధికారంలోకి వస్తుంది. రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయలు చందాలు ఇచ్చే పెట్టుబడిదారులకు ఈ దేశంలో కొదవలేదు. నోటుకు ఓటు అమ్ముకునే ఓటర్లుకూ కొదవలేదు. మనదేశంలో ఎన్నికలంటే అంగ బలం, అర్థ బలంతోపాటు కులం, మతం బలం కూడా ఉండాలి. ఎన్నికలంటే ఎన్నో రకాల సమీకరణలు పని చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The gym teacher who says he was beaten up by a first grader
Nara lokesh in chandrababus padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles