Gold robbery in hyderabad

gold robbery in hyderabad

gold robbery in hyderabad

gold.gif

Posted: 09/27/2012 04:35 PM IST
Gold robbery in hyderabad

gold robbery in hyderabad

రాష్ట్రంలో దొంగలు స్వైరవీహారం చేస్తున్నారు. ఇళ్లల్లోకి, దుకాణాల్లోకి చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మరో ప్రధాన నగరం విశాఖపట్టణంలో ఒక రోజు వ్యవధిలో చోరులు చెలరేగిపోయారు. దాదాపు మూడు కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. పెద్ద ఎత్తున సొమ్ము దోచుకెళ్లారు. సహజంగా రాత్రి వేళల్లో రాబరీ చేసే దొంగలు రూటు మార్చారు. వైజాగ్‌లో మంగళవారం-సెప్టెంబర్ 25న-ఏకంగా పట్టపగలే లూటికి తెగబడ్డారు. సినీ ఫక్కీలో నగల దుకాణాన్ని దోచేశారు. కత్తులు, తుపాకులతో బెదిరించి రూ.50 లక్షల విలువైన కేజీన్నర బంగారు ఆభరణాలు అపహరించారు. మురళీనగర్ ప్రాంతంలోని నందిత జ్యుయెలర్స్ దుకాణంలో జరిగిన ఈ లూటీ పర్వం నగరంలో సంచలనం రేకెత్తించింది. కారులో వచ్చి కొనుగోలుదారుల్లా షాపులోకి ప్రవేశించిన దుండగులు యజమానులను కత్తులు, తుపాకులతో బెదిరించి నోటికి, చేతులకు ప్లాస్టర్ వేశారు. దుకాణంలోని బంగారు ఆభరణాలను తమ వెంట తెచ్చకున్న బ్యాగులో వేసుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.

కేవలం బంగారు ఆభరణాలను మాత్రమే దోచుకెళ్లి వెండి వస్తువులను విడిచిపెట్టారు. క్యాష్ కౌంటర్‌లో సుమారు రూ.50 వేల నగదు ఉన్నప్పటికీ దొంగలు గమనించలేదు. కారులో రెండు కిలో మీటర్లు వెళ్లిన తర్వాత దొంగలు ఆ వాహనాన్ని మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో వదిలేసి ఉడాయించారు. చోరీ జరిగిన తీరును నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలను సేకరించారు. జంట నగరాలు(హైదరాబాద్-సికింద్రాబాద్) పరిధిలోని తాడ్‌బండ్ ప్రాంతంలోనూ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. సోమవారం-సెప్టెంబర్ 24న- తాడ్‌బండ్ రత్న హౌసింగ్ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడి స్వైరవీహారం చేశారు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి సర్వం దోచుకెళ్లారు. ఉలి వంటి పరికరంతో ప్రధాన ద్వారాన్ని పెకలించి మరీ పాడుపనికి పాల్పాడ్డారు. కేజిన్నర (150 తులాలు) బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదు సహా మొత్తం సుమారు రూ.70 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన ఇంటి యాజమాని దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరీ వెలుగు చూసింది. మరొక ఘటనలో నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు ఓ ఇంటిని గుల్ల చేశారు. తాళం పగులగొట్టి 25 తులాల బంగారం, కొంత నగదు అపహరించుకుపోయారు. వరుస దొంగతనాలతో రాష్ర్ట ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇళ్లకు, దుకాణాలకు తాళం వేసి వెళ్లాలంటేనే వణుకుతున్నారు. మరోవైపు బెదిరించి దోపిడీలకు పాల్పతున్న సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. బంగారం ధర రోజురోజుకి పెరుగుతుండడంతో దొంగలు ఎక్కువగా పసిడి ఆభరణాలనే కాజేస్తున్నారు. ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఎవరూ ఇళ్లలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచుకోవడం లేదు. దీంతో బంగారు నగలనే తస్కరులు టార్గెట్ చేస్తున్నారు. పసిడి కోసం ప్రాణాలు తీసేందుకు కూడా దుండగులు వెనుకాడడం లేదు. చోర కళలో ఆరితేరిన ముఠాలే భారీ దొంగతనాలకు ఒడిగడుతున్నాయి. అదునుచూసి అపహరణలకు దండెత్తున్నాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండడం వల్ల కొంతవరకు దొంగలబారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రజల సహకారంతో రక్షకభటులు సమర్థవంతంగా పనిచేసి లూటీరాయళ్ల ఆట కట్టిస్తేనే దోపిడీలకు అడ్డుకట్ట పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganapati homam for ys jagan release at guntur
Trs leaders meeting at kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles