Pm may address nation monday on coal scam

nmohansingh,145coal blocks, coal secretary letter, BJP leaders prakash javadekar, hamsaraju,

PM may address nation Monday on coal scam

PM.gif

Posted: 09/26/2012 01:37 PM IST
Pm may address nation monday on coal scam

PM may address nation Monday on coal scam

పాలక యుపిఎ-2, ప్రతిపక్షం ఎన్‌డిఎ తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని పార్ల మెంట్‌ శీతాకాల సమావేశాల సమయాన్ని వృధా చేశాయి. బొగ్గు గనుల కేటాయింపుల్లో రూ.1.86 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పేర్కొన్న అంశంపై పాలక ప్రతిపక్ష కూటములు ప్రజల్ని మభ్యపెట్టి ఉద్దేశంతోనే పని చేశాయి. కాగ్‌ నివేదిక తప్పుల తడకని స్వయంగా ఆర్థిక శాస్తవ్రేత్త అయిన ప్రధాని మన్‌మో హన్‌సింగ్‌ చెప్పడం దేశ ప్రజల్ని ఆశ్చర్యపర్చింది. ఒక రాజ్యాంగ వ్యవస్ధను ఆయన తప్పుపట్టినపుడు ఆ వ్యవస్థ ‘కాగ్‌’ దేశ అత్యున్నత రాజ్యాంగ సభను 120 కోట్లమంది ప్రజల్ని, కేంద్రప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్లే కదా!తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించిన ‘కాగ్‌’ చీఫ్‌ వినోద్‌రాయ్‌పై, ఆయనకు సహకరించిన వారిపై కఠినచర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉండదా? మరి కేంద్రప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయిందన్న ప్రశ్న భారతీయ పౌరుడికి ఎందుకు కలగకూడదు? అంటే కేవలం ‘కాగ్‌’ నివేదికను తేలికచేసి చూపి బొగ్గు కుంభకోణంనుండి ప్రజల దృష్టిని మళ్లించటానికే ప్రధానమంత్రి అలా మాట్లాడారా? ఆయన తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు జవాబు ఇవ్వలేక ‘కాగ్‌’ విశ్వసనీయతనే ప్రశ్నించడం మన ప్రజాసామ్య దేశంలో బాధాకరమైన ఘట్టం. కొందరు కేంద్రమంత్రులు ‘కాగ్‌’ అస్తిత్వాన్ని సవాలు చేశారు. అసలు బొగ్గు కుంభకోణంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, అసలు త్రవ్వకాలే జరగలేదని, జరగనప్పుడు అవినీతి అనే అంశం ఎక్కడుందని కూడా ‘కాగ్‌’ను నిలదీశారు. గతంలో 2-జి కుంభకోణంపై కూడా వారు అలాగే మాట్లాడారు.

PM may address nation Monday on coal scam

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విభాగాలలో, ప్రభుత్వరంగ సంస్ధలో ఆడిట్‌ జరిపి అవకతవకలను ఎత్తిచూపే అధికారం కాగ్‌కు ఉంది. మరి అలాంటి ఆడిట్‌ వ్యవస్థను ప్రశ్నిస్తున్న పాలక యుపిఎ కూటమి మంత్రులు ‘కాగ్‌’కు ప్రత్యామ్నాయ వ్యవస్ధ మరేదన్నా ఉంటే దానితోనైనా ఎందుకు ఆ అవినీతిపై దర్యాప్తుకు ఆదేశించలేకపోయిందో జవాబు చెప్పాలి. పాలకపక్షం వితండవాదం చేస్తూ పార్లమెంట్‌ సమయం వృధా కావటానికి ప్రతిపక్షానికి అవకాశం ఇస్తూ తన జవాబుదారీతనం నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష ఎన్‌డిఎ ఈ విషయంపై ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో 13 రోజులపాటు పార్లమెంట్‌లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి బొగ్గు కుంభకోణంలో వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడేదని అందరికీ తెలుసు.అయితే శిబూసోరేన్‌ బొగ్గుమంత్రిగా రాజీనామా చేయడం, తరచు ‘జైలు’కు వెళ్లడం వంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆ శాఖను అజమాయిషీ చేశారని, ఆయనను అప్పటి ఆ శాఖలో ఉన్న సహాయమంత్రి, ఇతర అధికారులు తప్పుదోవ పట్టించారనేది జగమెరిగిన సత్యం. తనకళ్ళ ముందు అవినీతి జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం ప్రధానమంత్రి ఘోర తప్పిదమే, అయితే దీనికి ప్రధానమంత్రి రాజీనామాతో రూ.1.86 వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఖజానాకు వచ్చి చేరుతాయా అంటే అది సాధ్యం కాని విషయమే. ఇందుకు ప్రధాని సృష్టించిన ఆర్థిక సంస్కరణల ఫలితాలే ప్రధాన కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rupee appreciation to cap gold prices
Telangana march for september 30 causes political debate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles