Ys bharati reddy cbi was one of those weapons

YS Bharati, CBI, Union Minister,, Veerappa Moily, congress, Ysr congress, ysrcp, Bharati Reddy

During the interaction with Prannoy Roy, Union Minister for Power Veerappa Moily fumbled saying that the Congress has different other weapons to fight the elections. YS Jagan’s wife Bharati Reddy also sought to know if the CBI was one of those weapons.

YS Bharati Reddy CBI was one of those weapons.png

Posted: 08/28/2012 02:38 PM IST
Ys bharati reddy cbi was one of those weapons

YS-Bharathiవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పటి నుండి ఆయన పార్టీ బాధ్యతలు వారి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. జగన్ జైలుకు వెళ్ళినప్పటి నుండి వైయస్ విజయమ్మ పార్టీకి సంబంధించిన క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్న ఉప ఎన్నికల ప్రచారం, వాటి తరువాత ధర్నాలు ఇలా నిత్యం ప్రజల్లో మమేకం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జగన్ సోదరి కూడా మొన్న ఉప ఎన్నికల్లో తన వాడి వేడి ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

జగన్ భార్య వైయస్ భారతి కూడా తన భర్త పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారలు తెరవెనుక ఉండి చక్కబెట్టేస్తున్నారు. అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చే వైయస్ భారతి నిన్న నేషనల్ ఛానల్ అయిన ఎన్.డి.టి.వి. సర్వే ఫలితాల చర్చ జరిగింది. ఈ చర్చలో కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. ఈ చర్చ వారిద్దరి మధ్య వాడి వేడిగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం పై వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఇంకా పద్దెనిమిది నెలల సమయం ఉందని, అందువల్ల ప్రజలలో ఆదరణ పెంచుకోవడానికి తమ అస్త్రాలు తమకు ఉన్నాయని మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తుందా అనేది ఇప్పుడే చెప్పజాలనని ఆయన అన్నారు. దీనికి కౌంటర్ గా వైయస్ భారతి మాట్లాడుతూ... కాంగ్రెస్ అస్త్రాలలో సిబిఐ కూడా ఒకటి అని వ్యాఖ్యానించారు. సిబిఐని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ జగన్ ను వేధిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారని, కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదని భారతి పేర్కొన్నారు.

ఈ చర్చలో భారతి మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే భారతికి రాజకీయాల పై ఉన్న పట్టును గానీ, ఆమె వాక్పటిమను గాని తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి వీరప్ప మొయిలీకి భారతి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రాజకీయాలలో పెద్ద ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla revanth reddy fire o ndtv results
Lpg tanker lorry explodes causing huge fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles