Who signalled the powerplay

Who signalled the Powerplay?Sri Lanka v India at Hambantota, India tour of Sri Lanka, India cricket, Sri Lanka cricket

Who signalled the Powerplay?

Powerplay.gif

Posted: 07/25/2012 04:30 PM IST
Who signalled the powerplay

Who signalled the Powerplay?

భారత్, శ్రీలంక  మధ్య తొలి వన్డే  సంగతి. ఇన్నింగ్స్  ఆఖర్లో భారత  బ్యాట్స్ మెన్  పవర్ ప్లే  తీసుకుంటామని  అంపైర్లకు  చెప్పారు.  ఇంకెక్కడి  పవర్ ప్లే ..ఎప్పుడో  అయిపోయింది కదా  అనడంతో  బ్యాట్స్ మెన్  కంగుతిన్నారు.  ఇంతకీ  బ్యాట్స్ మెన్  కు తెలియకుండా  పవర్ ప్లే ఎలా  అయిపోయింది.  సాధారణంగా  బ్యాటింగ్  జట్టు  పవర్ ప్లేను  30 ఓవర్ల  తర్వాత తీసుకుంటుంది.  కానీ తొలి వన్డేలో స్కోరు  బోర్డు ప్రకారం భారత్  17వ ఓవర్లో   పవర్ ప్లే తీసుకుంది.    అప్పుడు  సెహ్వాగ్ , కోహ్లి  క్రీజులో  ఉన్నారు. 21 ఓవర్లో  ముగిసిన  ఆ పవర్ ప్లే లో  భారత్ 32  పరుగులు  చేసింది వికేట్లేమి కోల్పోలేదు. బ్యాటింగ్  పవర్ ప్లే  అని అంపైర్ల  సూచించడంతో  శ్రీలంక  కెప్టెన్  అందుకు తగ్గట్టు  ఫిల్డర్లను మోహరించాడు.  పాపం  మన బ్యాట్స్ మెన్ కు ఇదేమి  తెలియక  నెమ్మదిగా  బ్యాటింగ్   చేశారు. ఇంతకీ  తప్పు ఎక్కడ జరిగిందంటే.. 16వ  ఓవర్  చివర్లో  టోపి  కావాలని  కోహ్లి  భారత డ్రెస్సింగ్   రూమ్ కు చేత్తో సైగ  చేశాడు.  అతడు బ్యాటింగ్  పవర్ ప్లే  కోరుతున్నాడని  భావించిన అంఫైర .. భారత్ బ్యాటింగ్  పవర్ ప్లే  తీసుకుంటోందని  వ్రుత్తాకారంలో  తిప్పుతూ  సైగ చేశాడు.  మొత్తానికి  మనవాళ్లకు తెలియకుండానే   పవర్ ప్లే  ముగిసింది.  దీని గురించి  వీరు మాట్లాడుతూ..  ఈ విషయంపై  అంపైర్ ను  అడిగితే..  కోహ్లీ సిగ్నల్  ఇచ్చాడు అని చెప్పాడు. కోహ్లిని   ఇదే విషయంపై ప్రశ్నించగా  ..పవర్ ప్లే ను  నేనెప్పుడు అడిగాను.. టోపీ కావాలని డ్రెస్సింగ్  రూమ్  సిబ్బందిని  కోరానంతే అని వివరించాడు.  ఇకపై  టోపీ అడిగేటప్పుడు  మన బ్యాట్స్ మెన్  జాగ్రత్తగా ఉంటారనడంలో  సందేహమా..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Economic offences court declares minister k parthasarathy
Prisoners to cultivate alfalfa for himalaya herbal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles