Pro telangana protesters greet pranab in hyderabad

Pro-Telangana protesters greet Pranab in Hyderabad,pranab mukherjee-telangana protest,upa presidential candidate, hyderabad visit,telanganites protested

Pro-Telangana protesters greet Pranab in Hyderabad

Pranab 1.gif

Posted: 07/02/2012 10:57 AM IST
Pro telangana protesters greet pranab in hyderabad

Pro-Telangana protesters greet Pranab in Hyderabad

యుపిఏ తరపున రాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతున్న  ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ వాదుల  నుంచి నిరసన సెగ తప్పలేదు.  యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రభృతులు ఘనస్వాగతం పలికి జూబ్లీహాలులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశానికి తీసుకుని వెళ్ళారు. కాగా బేగంపేట విమానాశ్రయంలో ప్రణబ్ ముఖర్జీకి కండువాలు కప్పి స్వాగతం పలికేందుకు రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అనుచరులు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఆమె భర్త బండ చంద్రారెడ్డి అనుచరులు పోటీ పడ్డారు. అయితే ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మంత్రి దానం నాగేందర్ బండ చంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గమనించిన ప్రణబ్ కొంత చిరాకు పడ్డారు. మరోవైపు ప్రణబ్ కాన్వాయ్ వెళ్ళే దారిలో బేగంపేట విమానాశ్రయం చౌరస్తా, ప్రకాశ్ నగర్ వద్ద తెలంగాణ మాల మహానాడు నేతలు, కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Pro-Telangana protesters greet Pranab in Hyderabad

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranabmukharjee phone to ys vijayamma
Yeddi sets july 5th deadline  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles