Congress target 2014

congress target 2014, Chiranjeevi, Delhi, Sonia Gandhi, Ganta srinivas Rao, PRP leaders, 2014 election, PCC Cheif Bosta Satyanarayana, Azad,

congress target 2014

congress.gif

Posted: 06/28/2012 10:35 AM IST
Congress target 2014

congress target 2014

ఉప ఎన్నికల ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2014 ఎన్నికలలో విజయం సాధించటానికి అనుసరించవలసిన పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయటానికి కాంగ్రెస్  అధ్యక్షురాలు సోనియాగాంధీ తగిన చర్యలు తీసుకోనున్నట్లు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర నాయకత్వం మార్పుకు దారితీస్తాయని తాను ఏమాత్రం భావించటం లేదనీ, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసుకుపోతే 2014లో ఘనవిజయం సాధించి తీరుతామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీనాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించటం, ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకావటంతో పెల్లుబికిన సానుభూతి పార్టీ ఓటమికి దారి తీసిందని అభిప్రాయ పడ్డారు.

ఉపఎన్నికల ఓటమిని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పోస్టుమార్టం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు విడివిడిగా తమ వివరణలు ఇచ్చారు.  రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పార్టీ అధినేత్రిని కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. అధినాయకత్వం పిలుపుమేరకు చిరంజీవి ఢిల్లీకి వచ్చి పార్టీ అధ్యక్షురాలితో సుమారు ఇరవై నిమిషాల పాటు పార్టీ,ప్రభుత్వం గురించి నిక్కచ్చిగా తన అభిప్రాయాలను తెలియజేశారు. సమావేశం తరువాత ఆయన సోనియాగాంధీ నివాసం బయట విలేఖరులతో మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi chargesheet likely in adarsh scam today
Google builds artificial brain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles