Us woman jailed for shooting romance tape with son

US woman jailed for shooting romance tape with son,Mother with son prostitution Case, 32 years old Mistie Rebecca Atkinson, California County Superiar Court, Hotel, Facebook, Nude Photos, Family Members Arrest, psychologists, Rebecca Nude photos, Genetic Attraction, Internet

US woman jailed for shooting romance tape with son

woman.gif

Posted: 06/25/2012 11:19 AM IST
Us woman jailed for shooting romance tape with son

US woman jailed for shooting romance tape with son

మానవ సంబంధాలు మరీ అధ్వాన్నంగా, పరమ దరిద్రంగా తయారవుతున్నాయి.   ఓ తల్లే తన టీనేజ్ కొడుకుతో  కామ కార్యాకలాపాల్లో  మునిగితేలింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. చెబుతుంటే రెండు చెవులూ మూసుకుని ఇబ్బందిపడాల్సిన నీచ కార్యం ఇది. 'కామా తురానం న భయం న లజ్జ' అన్నది ఈ మహిళకు అక్షరాలా అతుకుతుంది. నవమాసాలూ మోసి జన్మనిచ్చిన పుత్రుడితోనే కామం నెరపి అమ్మతనానికే మచ్చ తెచ్చిన అమెరికాలోని క్యాలిఫోర్నియా మహిళకు నాపాకౌంటీ కోర్టు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల జైలుశిక్ష విధించింది. 32 సంవత్సరాల రెబెక్కా అట్కిన్సన్‌కు కొడుకు పుట్టిన తర్వాత.. భర్తతో విభేదాల కారణంగా విడిపోయి మరో బోయ్‌ఫ్రెండ్‌తో ఉంటోంది. 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇటీవలే 16సంవత్సరాల తన కొడుకును కలుసుకుంది.తర్వాత క్యాలిఫోర్నియా నగరంలోని ఉకియాలో ఓ హోటల్‌కు వెళ్లి అతడితో కామకృత్యాలు తీర్చుకుంది. దీన్ని ఆమె కొడుకు తన మొబైల్‌లో చిత్రించాడు. ఈ సందర్భంగానే ఆమె పోలీసులకు దొరికిపోయింది. కూపీ లాగగా అట్కిన్సన్ కొడుకును రెచ్చగొట్టడం కోసం తన నగ్న ఫొటోలను ఫేస్‌బుక్ ద్వారా పంపిన విషయం కూడా బయటపడింది.

US woman jailed for shooting romance tape with son

ఆధారాలతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. నేరం నిరూపణ కావడంతో కోర్టు ఆమెకు జైలుశిక్ష ఖరారు చేసింది. ఇంతచేసినా అట్కిన్సన్ మాత్రం తన చర్యను సమర్థించుకోవడం విచారకరం. తనకు తన కొడుకుకు మధ్య 'అది జరగలేదని'.. జన్యుపరమైన ఆకర్షణ మాత్రమేనని వివరణ ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న వారిలో 50శాతం మందిలో ఈ ఆకర్షణ ఏర్పడుతుందని.. ఇది చాలా శక్తిమంతమైనదని చెప్పుకొచ్చింది. ఎంత చెప్పినా అట్కిన్సన్ చేసిన చండాలమైన పనిని మానవమాత్రులెవరూ క్షమించరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhoni fifth in icc odi rankings
Arrangements for tdp maha dhana at vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles