Nearly ten lack ten thousand new jobs in ap it sector

nearly ten lack ten thousand new jobs in ap it sector?

nearly ten lack ten thousand new jobs in ap it sector?

25.gif

Posted: 06/24/2012 05:27 PM IST
Nearly ten lack ten thousand new jobs in ap it sector

     అంతర్జాతీయ ఐ.టి సమ్మిట్ తర్వాత కార్యక్రమాలపై సీఎం కిరణ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. కొత్తగా ఎన్ని యూనిట్ల ప్రారంభానికి ఒప్పందాలు జరిగాయనే అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండు రోజుల సమ్మిట్ లో కొత్తగా 243ప్రతిపాదనలతో 265యూనిట్ల ఏర్పాటుకు 10eeపారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని ఐ.టి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయడానికి వచ్చిన ప్రతిపానలను శాఖల వారీగా పరిశీలిస్తే పారిశ్రామిక రంగంలో 128కొత్త యూనిట్లకు గానూ 2లక్షల 78వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 4లక్షల పది వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందన శాఖలో 92యూనిట్లు ప్రారంభానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 30వేల 990కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా దీని వల్ల సుమారు 59వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇక మౌళిక సదుపాయల రంగంలో కొత్తగా 13యూనిట్ల ప్రారంభానికి  ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 33వేల 300కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీని ద్వారా 16వేల మందికి  ఉపాధి లభిస్తుందని అంచనా.
 
   10e ఇటు ఐ.టి రంగంలోనూ కొత్తగా 13యూనిట్ల ప్రారంభానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 22వేల 400కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా దీని ద్వారా లక్షా 40వేల మందికి ఉపాధి లభించే అవకాశంముంది. పర్యాటక రంగంలో 14యూనిట్లు ప్రారంభానికి ప్రతిపాదనలు రాగా వీటికి గానూ 2800కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నారు. దీని ద్వారా 7,250మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వైద్య, ఆరోగ్య రంగంలో కొత్తగా 4యూనిట్లు ప్రారంభానికి పారిశ్రామిక వేత్తల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 675కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉన్నత విద్యా రంగంలో ఒక యూనిట్ ప్రారంభానికి ప్రతిపాదన వచ్చింది. దీనికి 2వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 40వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. పారిశ్రామిక రంగంలో కొత్త పరిశ్రమలు  రాలేదన్న వార్తలను మంత్రి గీతారెడ్డి కొట్టిపారేశారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న 115పరిశ్రమలలో ఇప్పటికే 4పూర్తయి 500కోట్ల టర్నోవర్ ను సాధిస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా 2000వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇంకా 91యూనిట్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయని, 20యూనిట్లు ప్రాధమిక స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  On real estate name gupta cheates hmda
Congress and bjp fight for president post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles