Chiranjeevi predicts doom for congress in 2014 polls

Rajya Sabha MP,Prajarajyam Party,Congress,Chiranjeevi

The former matinee idol attributed the miserable defeat of the party in the recent bypolls to the scant recognition the PRP workers got from the Congress leadership

chiranjeevi fire on congress leader.gif

Posted: 06/23/2012 11:24 AM IST
Chiranjeevi predicts doom for congress in 2014 polls

Chiru

మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పై తన దైనశైలిలో విరుచుకుపడ్డారు. దీనికి కారణం మొన్న గెలిచిన రెండు ఉప ఎన్నికల స్థానాల ఉత్సాహమో లేక ఇంత ప్రచారం చేసినా రెండే గెలిచామా అన్న బాధో లేక పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత తమ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనో ఏమో కానీ ఇన్ని రోజులు లోలోపల దిగమింగుకున్న ఆవేశాన్ని ఇవాళ రామచంద్రాపురం కార్యకర్తల మీటింగ్ లో  వెల్లగక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి శాసనసభకు గెలిచిన తోట త్రిమూర్తులు కార్యర్తలతో పాటు వచ్చి చిరంజీవిని కలిశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన ఓట్లు లేనిదే రెండు చోట్ల కాంగ్రెసు ఎలా గెలిచిందని ఆయన అడిగారు. ప్రజారాజ్యం కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు మాత్రమే కాంగ్రెసుకు ఓటేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల్లో మార్పు వస్తుందని ఇంత కాలం ఎదురు చూశానని ఆయన అన్నారు. కానీ వారిలో ఏమాత్రం మార్పు రాలేదని అన్నారు. మొన్నటి ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల పట్ల సానుభూతి మాత్రమే కాంగ్రెసు ఓటమికి కారణం కాదని, కాంగ్రెసు వైఫల్యాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల పట్ల చూపుతున్న వివక్షను తాను సహించలేకపోతున్నానని, వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారికి తగిన ప్రాధాన్యం భవిష్యత్తులో ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీఎం కిరణ్, పీసీసీ ఛీప్ బొత్స ఢిల్లీలో ఉండంగా చిరంజీవి ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చమొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sand mafia in jaggayyapet
Ed to attach gali janardhana reddys properties soon online  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles